twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది నిరూపించడానికే 'ప్రేమ కథా చిత్రమ్‌' చేశా :మారుతి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ద్వంద్వార్థ సంభాషణలతో సినిమాలు ఆడవు. కథలో సత్తా ఉంటేనే ఆడుతుందని నిరూపించడానికే 'ప్రేమ కథా చిత్రమ్‌' చేశాను అంటున్నారు మారుతి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ వహించిన చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్‌'. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే...నా గత సినిమాల్లో ఈ తరహా సంభాషణలు వాడినప్పటికీ... అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికే. అయితే వాటిని ప్రేక్షకులు ఇష్టపడితే.. సినీ పరిశ్రమలో కొందరు తప్పుగా ఉన్నాయని చిత్రీకరించారు. అయినా ఇక నేను ఆ వైపు పోను. వినోదం ఉన్న సినిమాలే చేస్తాను. నేను చేసే సినిమా వల్ల నిర్మాతకి, పంపిణీదారులకి డబ్బులు రావాలి. 'ప్రేమ కథా చిత్రమ్‌' కోసం సుధీర్‌ నటన, సంభాషణ శైలి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవన్నీ మంచి ఫలితాన్నే ఇచ్చాయి'' అన్నారు.

    ఇక ''సినిమా ఎలా తీస్తారు.. ఏం చెయ్యాలి అని తెలుసుకోవడానికే 'ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌'కి సహ నిర్మాతగా చేశాను. ఆ చిత్రం పూర్తయ్యాక అసలు సినిమా ఎలా నిర్మించకూడదో తెలిసింది'' అన్నారు మారుతి.

    దర్శకత్వ పర్యవేక్షణను మాత్రం మళ్లీ చేసే ఉద్దేశం లేదని మారుతి స్పష్టం చేశారు. అల్లు శిరీష్‌తో చేస్తున్న 'కొత్త జంట' గురించి ప్రస్తావిస్తే ''ఇది మీడియా నేపథ్యంగా సాగే చిత్రం. ఇక నిర్మాతగా చేస్తున్న 'రొమాన్స్‌' విడుదలకు సిద్ధమవుతోంది. యానిమేషన్‌ చిత్రం తీసే ఆలోచన ఉంది''అన్నారు.

    ప్రేమకథా చిత్రమ్ ఈ నెల 7న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీసు వద్ద ఫలితాలు సాధిస్తోంది. సినిమా ఇంట్రస్టింగ్ స్టోరీలైన్, స్క్రీన్ ప్లే, స్ర్కిప్టు..... నటీనటుల పెర్ఫార్మెన్స్ ఫలితంగా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని మిగిల్చింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందడంతో పాటు, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తొలిరోజైన శుక్రవారం ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 3.14 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Maruthi says that he don't want to put double meaning dailouges in his next filmx.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X