Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బంధువుల ద్వారా అల్లు అర్జున్ పరిచయం, మలుపు తిప్పింది
అలాగే 2004లో ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో-ప్రొడ్యుసర్‌గా ఉన్నా. సినిమా డెరైక్షన్ చేయాలనే కోరిక నాలో బలంగా ఉండేది. గతంలో షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన అనుభవం దృష్ట్యా డెరైక్షన్ చేయగలనన్న నమ్మకం ధృడంగా ఉండేది. 2009 లోనే బస్‌స్టాప్ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాను. ఏడాదిన్నర పాటు నిర్మాతల చుట్టూ తిరిగాను. ఫలితం లేదు. ఈ క్రమంలోనే 'ఈ రోజుల్లో' సినిమా స్క్రిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు.
ఇక నిర్మాతలు ఎవరూ దొరకక పోయేసరికి నా దగ్గర ఉన్న డబ్బులతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. గుడ్ ఫిలిం గ్రూపు పేరిట కొంతమంది స్నేహితులు కలిసి 'ఈ రోజుల్లో' సినిమాను తెరకెక్కించాం. సరదాగా చేసిన సినిమా పెద్ద హిట్ కావ డం ఆనందాన్ని ఇచ్చింది. ఆ సక్సెస్ అందించిన 'ఎనర్జీ'తో రెడీగా ఉన్న 'బస్‌స్టాప్'ను తెరకెక్కించా. 2012 అందించిన సక్సెస్ మరిచిపోలేనిది.' అని చెప్పుకొచ్చారు మారుతి.
మచిలీపట్నంలో నా చిన్నతనంలో రోడ్ల మీదనే ఎక్కువగా గడిపా. సినిమాలంటే విపరీతమైన పిచ్చి. చిరంజీవంటే మరీనూ. . సిని మాలంటే మక్కువ ఉండడంతో పాటు యానిమేషన్ రంగానికి ప్రాధాన్యం ఉండనే ఉంది. ఇం కేం.. తాను కూడబెట్టిన డబ్బులతో హైదరాబాద్ వచ్చేసి 2డీ యానిమేషన్ కోర్సు పూర్తి చేశా. 2డీ యానిమేషన్ పూర్తి చేసిన తరువాత కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశా. అదే సమయంలో కుటుంబాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేశా అని చెప్పారు.