Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
"లవ్ యురా బంగారం'' బూతు పై మారుతి వివరణ
హైదరాబాద్: మారుతి బ్యానర్ నుంచి రీసెంట్ గా వచ్చి డిజాస్టర్ అయిన చిత్రం 'లవ్ యు బంగారం'. జనవరి 24 న విడుదల అయిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రాహుల్ , రాజీవ్ లు జంటగా గోవి అని కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందించారు. పరమ బూతు చిత్రంగా దీనిపై చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయిన నేపధ్యంలో దర్శకుడు మారుతి దీనిపై వివరణ ఇచ్చారు. బూతు పెడితే సినిమా హిట్ కాదు అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ... మారుతి సినిమా అని ఓ మంచి బూతు పోస్టర్ వేసేస్తే కొనేస్తారు అనే భ్రమలో ఉంటున్నారు. మారుతి సినిమా అనే బ్యానర్ పెట్టినా,బూతులు పెట్టినా డిజాస్టర్ లు,అట్టర్ ఫ్లాపుల అవుతాయి అనటానికి ఉదాహరణ.."లవ్ యురా బంగారం'' సినిమా. ఎందుకంటే...మొదట ఆ దర్శకుడు నాకు పది నిముషాలు కథ చెప్పాడు. నేను కొత్త జంట చిత్రం లో బిజీగా ఉన్నాను. అతను షూటింగ్ చేసుకున్నాడు. మా ఎడిటర్ ని అడిగాను..ఎలా వస్తోంది అంటే..బ్రహ్మాండంగా వస్తోంది అన్నాడు.
సినిమా పూర్తైన తర్వాత...చూసి ఓ పెద్ద కరెక్షన్స్ లిస్ట్ రాసి ఇచ్చాను. ఏంటి ఇవి పెట్టేసారు అంటే ...ఆ దర్శకుడు చెప్పింది ఏమిటీ అంటే..సార్ ..కమర్షియల్ పాయింట్స్ లేకపోతే సినిమా చూడరు కదా...మీ బస్ స్టాఫ్ లో అయితే పెడతారు. నా సినిమాలో పెట్టనివ్వరా...నా సినిమా పెద్ద హిట్టు అవ్వాలని ఉండదా నాకు... అని డైరక్టర్ ఫీలయ్యాడు. సరే బాబు నీ ఇష్టం. ప్రొడ్యూసర్ గా పేరు వేసుకున్నందుకు అందరూ ఒక రోజు అయితే ఉతికి ఆరేస్తారు ..నేను మెంటల్ గా ప్రిపేరు. అని వదిలేసాను..దాని రిజల్ట్...నూన్ షో నుంచి ఫిఫ్టీ పర్శంటే...ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ కు ఫుల్ క్లారిటీ ఉంది... ఏ సినిమా చూడాలి..ఏది చూడకూడదు...మనం నాలుగు బూతులు పెడితే ఆడేస్తుంది లేకపోతే ఇంకోటి పెడితే ఆడేస్తుందనో... టిక్కెట్లు తెగుతాయినుకుంటే అదో భ్రమ అని తేల్చి చెప్పారు.