చింపేసారు.. వావ్.. గుండెను పిండేసింది.. బ్రిల్లియంట్.. ఎన్టీఆర్, సుధీర్‌బాబు, మారుతి ట్వీట్లు

నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన జెర్సీ మూవీ తొలి ఆట నుంచి సక్సెస్‌తో దూసుకెళ్తున్నది. హృదయానికి తాకే చిత్రంగా రూపొందిన భావోద్వేగమైన కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్, సుధీర్ బాబు, గోపిమోహన్, మారుతి తదితరులు ట్వీట్లు చేశారు. వారి స్పందన ఏమిటంటే..

 జెర్సీ వావ్ అనిపించే సినిమా

జెర్సీ వావ్ అనిపించే సినిమా

జెర్సీ మూవీ వావ్ అనిపించే చిత్రం. నాని నటన బ్రిల్లియంట్. నాని కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్. శ్రద్ధా శ్రీనాథ్ ఫెంటాస్టిక్ ఫెర్హార్మెన్స్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతిభ సూపర్. అతడి విజన్, సినిమాను తెరకెక్కించిన విధానం క్లాసిక్. అనిరుధ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అని రచయిత గోపి మోహన్ ట్వీట్ చేశారు.

నానితో నా బంధం ఏమిటంటే

నానితో నా బంధం ఏమిటంటే

నానితో నా బంధం మాటల్లో చెప్పలేను. సినిమాలో నానితో ఉన్న రిలేషన్ ఏమిటో తెలియాంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. జెర్సీ సినిమాకు వెళ్లితే ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలుస్తుంది అని యాక్టర్ హరీష్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ ఓ కీలక పాత్రను పోషించారు.

జెర్సీ హృదయానికి తాకింది

జెర్సీ హృదయానికి తాకింది

జెర్సీ మూవీ వండర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. నాని గారి నిజాయితీ కూడిన ఫెర్ఫార్మెన్స్ హృదయాన్ని తాకింది. ఆయన సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. సినిమా ప్రతీ ఫ్రేమ్‌లో దర్శకుడు గౌతమ్ నిజాయితీ కనిపించింది. అనిరుధ్ బీజియం బాగుంది. నా మిత్రుడు నిర్మాత నాగవంశీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సక్సెస్ కొట్టినందుకు కంగ్రాట్స్ అని దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు

 జెర్సీ గురించి నాని ట్వీట్

జెర్సీ గురించి నాని ట్వీట్

జెర్సీ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే మాటలు రావడం లేదు. టీమ్ జెర్సీ ఈ సినిమాను తీసినందుకు చాలా గర్వపడుతున్నది. మీ చూపిస్తున్న ఆదరణకు మేము ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం అని ట్వీట్ చేశారు. అమితాబ్, రాజేష్ ఖన్నా నటించిన ఆనంద్ సినిమాలోని డైలాగ్‌ను కోట్ చేశారు. బాబు మోషాయ్.. జీవితం పెద్దగా ఉండాలి. సుదీర్ఘంగా ఉండాలి అని నాని పేర్కొన్నారు.

సినిమా అద్బుతంగా.. జూ ఎన్టీఆర్

సినిమా అద్బుతంగా.. జూ ఎన్టీఆర్

జెర్సీ సినిమా అద్భుతంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి ఎంచుకున్న సబ్జెక్ట్ అమోఘం. నాని తన అనిర్వచనీయమైన నటనా ప్రతిభతో బంతిని పార్క్ బయటకు కొట్టాడు. నీ ఫెర్ఫార్మెన్స్‌కు నేను ముగ్ధుడినయ్యాను. జెర్సీ చూసిన తర్వాత నేను చాలా గర్వ పడుతున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

చింపేస్తారని అనుకొన్నాను

చింపేస్తారని అనుకొన్నాను

గట్టిగా అనుకొన్నాను.. నాని గారు ఈసారి చింపేస్తారని.. ఇది రా సినిమా అంటే అని చూపించారు గౌతమ్ గ్యాంగ్. తెలుగు సినిమా గర్వపడే సినిమా జెర్సీ అని దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశారు. తాజాగా మజిలీ చిత్రంతో విజయాన్ని అందుకొన్నారు. గతంలో నిన్నుకోరి సినిమాను నానితో తీసిన సంగతి తెలిసిందే.

నేచురల్ స్టార్ ఎందుకు అంటారంటే

నేచురల్ స్టార్ ఎందుకు అంటారంటే

నానిని నేచురల్ స్టార్ అని ఎందుకు అంటారో జెర్సీ సినిమా నిరూపించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. గుండెను తాకే విధంగా స్ట్రోర్ట్స్ డ్రామాను తెరకెక్కించారు. దర్శకుడు గౌతమ్ టాలెంట్ అమోఘం. చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్ అని నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు.

 సుధీర్ బాబు ట్వీట్

సుధీర్ బాబు ట్వీట్

జెర్సీ ఓ వేడుకలాంటి సినిమా. ఎక్కువ రోజులు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం. ఈ సినిమా ఇంకా నన్ను వెంటాడుతున్నది. నాని నటన లవ్లీగా ఉంది. దర్శకుడు గౌతమ్ ప్రతిభ అద్భుతం. శ్రద్ధా శ్రీనాథ్ నటన క్లాసీగా ఉంది. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ అని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

అనిరుధ్ రవిచంద్రన్ ట్వీట్

నా పని అయిపోయిందని అనుకొన్నారా అంటూ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ట్వీట్ చేశారు. రజనీకాంత్ పేట్టా సినిమాలోని డైలాగ్‌ను కోట్ చేసి తన ఆనందాన్ని పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X