»   »  అల్లు అర్జున్ ఆధ్వర్యంలో మారుతి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

అల్లు అర్జున్ ఆధ్వర్యంలో మారుతి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు దర్శకుడు మారుతికి గీతా ఆర్ట్స్ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తో సినిమా చేయడంతో పాటు ఇటీవల గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జిఏ 2 బేనర్లో ‘భలే భలే మగాడివోయ్' సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో మారుతిని ప్రత్యేకంగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఆహ్వానించి పుట్టినరోజు వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ తో పాటు అల్లు అరవింద్, అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ వల్లనే తనకు మెగా కుటుంబంతో అనుబంధం ఏర్పడిందని, బన్నీ సమక్షంలో పుట్టినరోజు వేడుక జరుగడం ఆనందంగా ఉందని మారుతి సంతోషం వ్యక్తం చేసారు.

మారుతి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

బన్నీ, మారుతి

బన్నీ, మారుతి


మారుతిని ఆహ్వానిస్తూ పుష్పగుచ్చం అందిస్తున్న అల్లు అర్జున్.

కేక్ కటింగ్

కేక్ కటింగ్


అల్లు అర్జున్, అల్లు అరవింద్ సమక్షంలో కేక్ కట్ చేస్తున్న దర్శకుడు మారుతి.

అరవింద్

అరవింద్


దర్శకుడు మారుతికి కేక్ తినిపిస్తున్న నిర్మాత అల్లు అరవింద్.

అల్లు శిరీష్

అల్లు శిరీష్


దర్శకుడు మారుతికి కేక్ తినిపిస్తున్న అల్లు శిరీష్.

బన్నీ, అరవింద్

బన్నీ, అరవింద్


గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్.

English summary
Check out photos of Maruthi birthday celebrations at Geetha Arts office.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu