Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సొంతిటి అల్లుడిలా ఆదరిస్తున్నారు.. శైలజారెడ్డి అల్లుడి విజయంపై మారుతి
శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ - యువ సామ్రాట్ నాగ చైతన్య యువసామ్రాట్ నాగచైతన్య , అను ఇమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణ లో నాగవంశి.ఎస్, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన హిలేరియస్ ఫ్యామిలి ఎంటర్టైనర్ శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయకచవితి సంధర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మెదటిరోజు 12 కోట్లు వసూలు చేయ్యటమె కాకుండా మూడురోజులకి దాదాపు 23 కోట్ల రూపాయిలు వసూలు చేసి పీపుల్స్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద యువసామ్రాట్ నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో రికార్డు కలెక్షన్లు వసూలుచేయబోతున్న సందర్భంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువసామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ మారుతి, నరేష్, 30 ఇయర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి, నిర్మాత నాగవంశి పాల్గొన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ళ ఇంటి సొంత అల్లుడి లా ఆదరిస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్లు కాని ఈ మూడురోజులు కలెక్షన్లు కాని మాకు చాలా ఆనందాన్ని ఎనర్జిని ఇచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ నాకు సూపర్ ఎనర్జిని ఇచ్చారు..ఈ జోనర్ కు ముఖ్యంగా యూత్ కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. ఫ్యామిలీస్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. నా గత చిత్రాల కంటే బాగుందన్నారు. టీం అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్పాలి అన్నారు.
చైతన్య గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ రావడం... అది నా సినిమాతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో మరో సినిమా చేయాలనేంత ఎనర్జీ ఇచ్చారు. నా సినిమాలో నటించిన అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా విజయం నాలో మరింత బాధ్యత పెంచింది. నా టీమ్ అందరూ అలానే సితార ఎంటర్టైన్ మెంట్ కి నా థ్యాంక్స్ చెబుతున్నాను అని మారుతి పేర్కొన్నారు.
మా హీరో నాగచైతన్య గారికి, అను గారికి మా శైలజారెడ్డి రమ్యకృష్ణ మేడమ్ కి నా స్పెషల్ థ్యాంక్స్.. ఈచిత్రాన్ని ఇలానే ఆదరించాలని కొరుకుంటున్నా.
అను ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ... ముందు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్ మీట్ కి కారణం మీరు. శైలజా రెడ్డి అల్లుడు దర్శకుడు మారుతికి, హీరో నాగచైతన్య కు చాలా చాలా థాంక్స్. సినిమా చూడని వాళ్లు థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడండి. అని మారుతి అన్నారు.