Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను అలాంటివాడ్ని కాదు అంటున్న మారుతి
హైదరాబాద్ : హిట్ వస్తే మారుతి పేరు వేసుకుంటాడు...అంతా తానే రాసాను..తీసానండాడు...అదే ప్లాపు వస్తే మాత్రం తనకు సంభంధం లేదు అంటాడంటూ మారుతి మీద గత కొంతకాలంగా టాక్స్ ఉన్నాయి. ప్రేమ కధా చిత్రమ్, మొన్నీమధ్య హిట్టైన లవర్స్ చిత్రాలు రిలీజై హిట్టై తర్వాత ఆ రచన, లేదా దర్శకత్వం చేసానంటూ ఆయన స్టేట్ మెంట్ ఇవ్వటం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో మారుతి తనదైన శైలిలో సమాధాన మిచ్చారు.
మారుతి మాట్లాడుతూ... ‘‘నేను సినిమాలో ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖలో మాత్రమే పేరు వేసుకుంటాను. అంతేగానీ వేరే ఎవరో రాసుకున్న డైలాగులకు నా పేరు వేసుకోను. దాదాపు ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్ కాను. రాయకుండా రాశానని, తీయకుండా తీశానని నేను చెప్పను. హిట్ వచ్చినప్పుడు ఆయా శాఖల్లో నా పేరు వేసుకుంటాననే అపవాదు ఉంది. హిట్ అయిన తర్వాత నా పేరు వేసుకోవడం అంటూ ఉండదు. నేను పనిచేసినప్పుడే టైటిల్ కార్డు వేసుకుంటాను. హిట్ అయితే ఎవరికి వచ్చే క్రెడిట్ వాళ్లకి వస్తుంది'' అని అన్నారు మారుతి.
ఇక రీసెంట్ గా...మారుతి టాకీస్, ఫుల్‌మూన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కాయ్ రాజా కాయ్'. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఈ నెల 28న ‘కాయ్ రాజా కాయ్' ఆడియో, వచ్చేనెల సినిమాను విడుదల చేస్తాం. శివగణేష్ నా దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాడు. కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాడు'' అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం కొత్తగా ఉంటుంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఆడే ఓ కుర్రాడి గేమ్ వల్ల అతని స్నేహితులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఆసక్తికరం'' అని అన్నారు. రామ్ కన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి, హరి, డీఎంకే, రాఘవ, టార్జన్, రోజా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు ఆర్ట్: కుమార్, సంగీతం: జె.బి., ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి., కెమెరా: దేవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీనివాస్ అడ్డాల, రచన-దర్శకత్వం: శివ గణేష్.