twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారుతి ‘చౌకబేరం’ ఐడియా గ్రేట్.. ఆయనను చూస్తే నవ్వొస్తుంది!

    |

    శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీక ష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, పంతం వంటి చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రాన్ని సమర్పించడం విశేషం. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్స్‌ను సప్తగిరి, పృథ్వీ విడుదల చేయగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు.

    మారుతి సినిమాలన్నీ పెద్ద హిట్

    మారుతి సినిమాలన్నీ పెద్ద హిట్

    సప్తగిరి మాట్లాడుతూ ''మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అవుతున్నాయి. ఆయన చిన్న సినిమాల మీద నమ్మకంతో నిర్మిస్తున్న సినిమాలు కూడా పెద్ద హిట్‌ కావాలి'' అని అన్నారు. వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ''భలే మంచి చౌకబేరమ్‌ పెద్ద హిట్‌ కావాలి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలి'' అని అన్నారు.

    ఎవరైనా బేరమాడుతారని

    ఎవరైనా బేరమాడుతారని

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ''కష్టపడి సంపాదించేవాడు ఎవరైనా బేరమాడుతారు. తప్పకుండా ఎక్కడో ఒకచోట బేరం ఆడే ఉంటాం. మారుతి ఓ దర్శకుడిగా ఉండి, తనకొచ్చే ఐడియాలను తాను స్ట్రీమ్‌లైన్‌ చేసి, మరొకరికి అప్పజెప్పడం గ్రేట్‌. నిర్మాత సతీష్‌కుమార్‌ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. వాళ్ల నాన్న, మా నాన్న ఫ్రెండ్స్‌. దర్శకుడికి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. రాజా రవీంద్రకు చాలా పెద్ద హిట్‌ కావాలి'' అని అన్నారు.

    మారుతి కాన్సెప్ట్‌తో సినిమా

    మారుతి కాన్సెప్ట్‌తో సినిమా

    నిర్మాత సతీష్‌ మాట్లాడుతూ ''మా అరోళ్ల గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. మారుతి కాన్సెప్ట్‌ తో సినిమా తీశాం. భలే మంచి చౌక బేరాన్ని అక్టోబర్‌ 5న విడుదల చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్‌ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఆయన చాలా సపోర్ట్‌ చేశారు. రిలీజ్‌కి రాధామోహన్‌ చేసిన సపోర్ట్‌ ని మర్చిపోలేను. ఆయన ఆక్సిజన్‌లాగా పనిచేశారు. మా దర్శకుడు మురళీ చాలా కష్టపడి, చాలా బాగా ప్లాన్‌ చేసి తీశారు. ఈ సినిమాలో ట్విస్ట్‌, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది అని అన్నారు.

     చాలా రిస్క్‌ చేసి సినిమా

    చాలా రిస్క్‌ చేసి సినిమా

    మారుతి మాట్లాడుతూ ఏ చిన్న సినిమా మొదలు కావాలన్నా ముందు నమ్మాల్సింది నిర్మాతే. ఎందుకంటే చాలా రిస్క్‌ చేసి సినిమా చేస్తారు నిర్మాతలు. పూర్తి రిస్క్‌ ఉంటుంది చిన్న సినిమా. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. అలాంటి చిన్న సినిమాను నమ్మి ముందుకొచ్చారు సతీశ్‌గారు. అరోళ్ల గ్రూప్‌, సత్యసాయి ఆర్ట్స్‌ మీద ఈ సినిమా చేస్తున్నాం. చిన్న థాట్‌ నుంచి వచ్చిన కథ ఇది అని చెప్పారు.

    డార్క్‌ కామెడీ, యాక్షన్‌ అన్నీ

    డార్క్‌ కామెడీ, యాక్షన్‌ అన్నీ

    కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ''మా సంస్థలో వచ్చిన ప్రతి సినిమాకూ సపోర్ట్‌ చేసి, సక్సెస్‌ ఇచ్చేది మీడియానే. ఈ సినిమా మొత్తం తయారు చేసి సిల్వర్‌ ప్లేట్టర్‌లో నా చేతికిచ్చి రిలీజ్‌ చేయమని అన్నారు. అంతకన్నా చౌకబేరమ్‌ దొరకదు. ఇదే నాకు భలే మంచి చౌక బేరమ్‌. ఈ సినిమాను నేను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్‌ నచ్చింది. మారుతి చాలా బాగా చేశారు. యూనిక్‌ కాన్సెప్ట్‌ ఇది. కన్‌ఫ్యూజన్‌, డార్క్‌ కామెడీ, యాక్షన్‌ అన్నీ ఉన్నాయి. మారుతి ఇచ్చిన కాన్సెప్ట్‌ ను రవి మలిచారు. దాన్ని దర్శకుడు చాలా బాగా తీశారు అని చెప్పారు.

    ఆ నమ్మకంతోనే ఈ సినిమా

    ఆ నమ్మకంతోనే ఈ సినిమా

    దర్శకుడు మురళీక ష్ణ మాట్లాడుతూ ''నాకు రవి, లక్కీ ఇద్దరూ చెరో చేయిలాంటివారు. ఈ సినిమా కోసం ముందు మారుతిగారికి ధన్యవాదాలు చెబుతున్నా. రోజులుమారాయి సినిమా చూసి ఆయన 'నా సినిమాను నేనెలా తీస్తానో.. మీరలా తీశారు' అని అన్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా ఇచ్చారు. రాధామోహన్‌గారు మాతో అసోసియేట్‌ కావడం మాకు భలే మంచి బేరమ్‌. సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది'' అని అన్నారు.

     సినిమాకు ప్రాణం పెట్టి

    సినిమాకు ప్రాణం పెట్టి

    రాజా రవీంద్ర మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు రవి. మాడ్యులేషన్‌లో చిన్న గ్యాప్‌ వచ్చినా చాలా ఎమోషన్‌ ఫీలయ్యేవాడు. ఈ సినిమాతో మారుతి చాలా మంచి క్యారక్టర్‌ ఇచ్చారు. మారుతిగారు ఇలాంటి కాన్సెప్ట్‌ లు రాస్తున్నందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చేయడం మాటలు కాదు. నిర్మాతకు నచ్చాలి. దర్శకుడు... ఆర్టిస్టులు వంటివన్నీ కుదరాలి. అదంతా చాలా పెద్ద ప్రాసెస్‌' అని అన్నారు.

     బేరమ్‌ ఆడే బట్టలు కొంటా

    బేరమ్‌ ఆడే బట్టలు కొంటా

    ఫృథ్వి మాట్లాడుతూ ''మా తాడేపల్లిగూడంలో కేజీల లెక్కన బట్టలు ఇచ్చేవారు. అప్పుడు తగ్గిస్తారా అని అడిగేవాడిని. ఇప్పటికీ నేను బేరమ్‌ ఆడే బట్టలు కొంటాను. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఇప్పుడొచ్చే సినిమాల్లో ఇది కొత్త పాయింట్‌. మారుతి మాతో సినిమాలు చేయించే విధానం చూస్తే మాకే నవ్వొస్తుంది. ఈ పోస్టర్‌ మీద రాధామోహన్‌గారి పేరు చూసి థ్రిల్‌ అయ్యా. రాజారవీంద్రగారు చేసిన పాత్రల్లో ఇంత ఎమోషన్‌, ఇంత వయలెంట్‌గా చేసిన పాత్ర ఇదే. ఈ సినిమా టీమ్‌ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి'' అని చెప్పారు.

    English summary
    ‘Bhale Manchi Chowka Beram’ movie is scheduled to release on October 5. Kerintha fame Nookaraju was the hero and Narthanasala fame Yamini Bhaskar was the female lead in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X