లవర్స్ కోసం మారుతి డైలాగ్స్ విజిల్స్ వేసేలా..

By Bojja Kumar

హైదరాబాద్: 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి సూపర్ హిట్ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేఖ స్థానం సంపాయించిన సుమంత్ అశ్విన్ హీరోగా, 'ప్రేమకథా చిత్రం' లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత నందిత హీరొయిన్ గా , మాయాబజార్ మూవీస్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి , మహేంద్ర బాబు లు కలసి నిర్మిస్తున్న చిత్రం లవర్స్. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి కథ, మాటలు అందించటమే కాక సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. హరి చిత్ర దర్శకుడు. జే.బి అందించిన సంగీతం ఇప్పటికే మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఈ సినిమమా ఆగస్టు లోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు..

Maruthi's 'Lovers' movie release on August

ఈ సందర్భం గా నిర్మాతలు మాట్లాడుతూ.." అంతకుముందు ఆ తరువాత చిత్రం తరువాత సుమంత అశ్విన్, ప్రేమకథ చిత్రం తరువాత నందిత లు జంట గా , హరి దర్శకత్వం లో మాసంస్థ మాయాబజార్ మూవీస్ పై వైవిధ్యమైన లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న చిత్రం లవర్స్... ఈ చిత్రం లో నందిత , సుమంత్ అశ్విన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి అంతే కాదు చక్కటి వినోదాన్ని పుట్టిస్తాయి. ఇటీవలే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న షామిలి అండ్ తేజస్విని లు చాలా చక్కటి పాత్రల్లో నటించారు. మారుతీ ఈ చిత్రానికి సమర్పకుడు అంతేకాకుండా కథ, మాటలు కూడా అందించారు. మారుతీ రాసిన మాటలు హీరో సుమంత్ నోట పలకటం ధియేటర్ లో విజిల్స్ పడేలా ఉంటాయి.

ఇప్పటికే బిజినెస్ లో మంచి క్రేజ్ ని సాధించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేస్తున్నాము. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకి రెడీ గా ఉంది, ఈ ఆగష్టు లో సినిమా విడుదల చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి హిట్ కావటం చాలా హ్యాపీ గా ఉంది. అంతే కాదు మా లవర్స్ సినిమా లో చివరి అరగంట లో వచ్చే సప్తగిరి పాత్ర చాలా వినోదాన్ని అందిస్తుంది. మా లవర్స్ సినిమా యువత ని ఆకట్టుకోవటమే కాకుండా ఫ్యామిలీ అంతా చక్కగా నవ్వుకునేలా ఉంటుంది." అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X