మారుతి మార్క్ ఉంటుందా? ( 'లవర్స్' ప్రివ్యూ)
హైదరాబాద్ : మారుతి చిత్రాలంటే ప్రేక్షకులలో కొన్ని ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన పేరు మీదే బిజినెస్ జరుగుతూంటాయి. తాజాగా మారుతి కథనం, మాటలు అందిస్తూ వచ్చిన ఈ చిత్రం ఆయన మార్క్ బూతు లేకుండా పూర్తి క్లీమ్ కామెడీగా రూపొందించారు. లవర్స్ సినిమా లో చివరి అరగంట లో వచ్చే సప్తగిరి పాత్ర చాలా వినోదాన్ని అందిస్తుంది. మా లవర్స్ సినిమా యువత ని ఆకట్టుకోవటమే కాకుండా ఫ్యామిలీ అంతా చక్కగా నవ్వుకునేలా ఉంటుంది
దర్శకుడు మాట్లాడుతూ ''యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించే కథ ఇది. వినోదభరితంగా ఉంటుంది. మారుతి, నిర్మాతలు చాలా సహకరించారు. జె.బి. సంగీతం బావుంది. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు ''అన్నారు. ''పాటలకు మంచి స్పందన వస్తోంది. మారుతి అందించిన కథనం, మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు నిర్మాతలు.
మారుతి మాట్లాడుతూ- ''కొత్త లవ్‌స్టోరీ ఇది. స్ర్కీన్‌ప్లే, మాటలు అందించాను. సాయి, సప్తగిరి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హరి చక్కగా డైరెక్ట్ చేశాడు. జెబి సంగీతం, జోషి కెమెరా సినిమాకు హైలైట్స్. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. నా గత సినిమాల్లాగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి'' అని అన్నారు.

సినిమా బాగా రావాలని నిర్మాతలు కష్టపడ్డారని, తన పాత్ర జనాలకు నచ్చుతుందని సుమంత్ అశ్విన్ తెలిపారు. సినిమా బాగా వచ్చిందని నందిత, జె.బి అన్నారు.
మారుతి సమర్పణలో రూపొందిన 'లవర్స్'లో సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించారు. మాయాబజార్ మూవీస్ నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మాతలు. హరినాథ్ దర్శకుడు. జె.బి.సంగీతాన్ని సమకూర్చారు.
నటీనటులు :సుమంత్ అశ్విన్, నందిత, షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు
కెమెరా:మల్హర్ భట్ జోషి,
సంగీతం:జె.బి.,
ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి.,
మాటలు:చింతపల్లి రమణ,
నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి.,
స్క్రీన్ ప్లే, సమర్పణ:మారుతి,
రచన, దర్శకత్వం:హరి.
విడుదల తేది: 15, ఆగస్టు 2014.


Click it and Unblock the Notifications











