విజయదశమి శుభాకంక్షలతో 'క్లోజ్ ఫ్రెండ్స్'
హైదరాబాద్: చిన్న చిత్రాలతో పెద్ద విజయా లు సాధించిన దర్శకుడు మారుతి తన టీం తో దాదాపు కొత్త నటీ నటులని పరిచయం చేస్తూ కొత్త కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న చిత్రం క్లోజ్ ఫ్రెండ్స్. సినిమా లవర్స్ సినిమా మరియు శ్రీ క్రియేషన్స్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అక్కిరెడ్డి కృష్ణ కుమార్ , అపర్ణ కోనేరు నిర్మాతలు. అరుణ్ పవర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
ఆద్యంతం కొత్తగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో 100%లవ్ , ఆటో నగర్ సూర్య ఫేం నందు, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, గీతాంజలి ఫేం మధు, నవీద్ , అభిలు హీరోలుగా, మధురిమ, షామిలి ,కేష, కృతి , భార్గవిలు హీరాయిన్స్ గా నటిస్తున్నారు. విజయదశమి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ "మారుతీ టీం అండ్ మా బ్యానర్ లలో అరుణ్ ని డైరెక్టర్ గా పరిచయం చెస్థూ తెరకెక్కిస్తున్న చిత్రం క్లోజ్ ఫ్రెండ్స్. నలుగురు స్నేహితులు, వాళ్ళ జీవితాలలో వచ్చిన మార్పులు , సమస్యలు , వాళ్ళు ఎదుర్కున్న తీరు వినోదాత్మకంగా వుంటూ ప్రతి సీన్
థ్రిల్ కలిగిస్తుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతుందని తెలిపారు.
షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ కథ చాలా కొత్త పాయింట్ తో మొదలవుతుంది. దర్శకుడు అరుణ్ చెప్పిన తీరు మాకు నచ్చి ఈ సినిమా ని చేసాము, మాకు చెప్పిన దానికి రెండింతలు బాగా తీసాడు. కథలోనే వినోదం ఉండేలా ఈ కథని రాసుకున్నాడు.
చూస్తున్న ప్రేక్షకుడు నవ్వుతూనే థ్రిల్ ని ఎంజాయ్ చేస్తాడు. అంతే కాదు ఒక చిన్న ట్విస్ట్ తో ఆశ్చర్యపోతాడని తెలిపారు.
ఈ సినిమా తరువాత అరుణ్ పెద్ద దర్శకుల లిస్టు లో చేరతాడనేది మా నమ్మకం. చిన్న చిత్రాలకి ప్రాణం పోసిన దర్శకుడు మారుతీ ఈ సినిమా ఇంత బాగా రావటానికి సహకరించారు. వారికి మా ధన్యవాదాలు. ఈ సినిమా లో నందు, మధు, నవీద్, అభి లు హీరోలుగా చేస్తుండగా, మధురిమ, షామిలి, కేష, కృతి, భార్గవి లు హీరాయిన్స్ గా చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా మొదటి టీజర్ రిలీజ్ చేస్తాము, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము " అని అన్నారు. ఈ సినిమా కి సంగీతం: జీవన్ బాబు (జే.బి), ఎడిటింగ్ : ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: విస్వా .డి.బి, నిర్మాతలు : అక్కిరెడ్డి కృష్ణ కుమార్, అపర్ణ కోనేరు , దర్శకుడు : అరుణ్ పవర్.


Click it and Unblock the Notifications











