»   »  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం...డైరెక్టర్ మారుతి స్క్రిప్టు!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం...డైరెక్టర్ మారుతి స్క్రిప్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస హిట్లతో అనతి కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి తాజాగా ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో మారుతి సినిమాలంటే బూతు కామెడీ ఉంటుందనే ముద్ర ఉండేది.

అయితే క్రమక్రమంగా తన పంథా మార్చుకుని ‘ప్రేమ కథా చిత్రమ్' లాంటి హారర్ కామెడీ సినిమాను, తర్వాత ‘భలే భలే మగాడివోయ్' లాంటి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌ను తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. భవిష్యత్తులో పెద్ద హీరోలతోనూ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

Maruthi tries to do movie with Pawan Kalyan, Mahesh Babu

తాను ఒకే జోనర్ సినిమాలకు పరిమితం కావాలనుకోవడం లేదని, అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని, అందుకు తగిన విధంగా స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటున్నట్లు మారుతి వెల్లడించారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడాలని ఎప్పటి నుండో ఉంది, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారికి సరిపోయే స్క్రిప్టు కూడా తన వద్ద ఉందని మారుతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మచిలీపట్నంలో పుట్టి పెరిగిన మారుతి గాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చి తర్వాత ఇక్కడే యానిమేషన్ ఇనిస్టిట్యూట్ పెట్టాడట. అల్లు అర్జున్ తన ఇనిస్టిట్యూట్ లో యానిమేషన్ నేర్చుకోవడంతో మెగా కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అలా చిరంజీవికి దగ్గరయ్యారు. ప్రజారాజ్యం పార్టీ జెండా రూపకల్పన చేసారు. ఆ సమయంలోనే చిరంజీవి తనలో దర్శకుడు ఉన్నాడని గుర్తించి ప్రోత్సహించాడని మారుతి పత్రికా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

English summary
Tollywood director Maruthi tries to do movie with Pawan Kalyan, Mahesh Babu.
Please Wait while comments are loading...