ఆమె మరణానికి కారణం...అతిగా మద్యం సేవించడమే!
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇషా మంత్రి ఇటీవల గోవాలోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి వెళ్లి అనుమానాస్పదంగా మరణించింది. ప్రియాంక చోప్రా నటించిన మేరీకోమ్ చిత్రంలో ప్రియాంక చోప్రా దుస్తులను ఈమే డిజైన్ చేసింది. డిసెంబరు 29వ తేదిన గోవా బీచ్లో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో స్టేజ్ పై నుంచి క్రింద పడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించింది.
తాజాగా అందిన పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం 27 సంవత్సరాల ఇషా మంత్రి అతిగా మద్యం సేవించడం వల్ల కింద పడి పోయిందని, ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైందని...గోవా టూరిజం మినిస్టర్ దిలీప్ పారులేకర్ మీడియాకు వెల్లడించారు. మ్యూజిక్ ఫెస్టివల్ రాత్రి 10 గంటలకే ముగిసిందని, ఆమె మరణించిన సంఘటన రాత్రి 11.30 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు.

రాత్రి పూట ఆమె 11 గంటల వరకు మద్యం సేవిస్తూనే ఉందని టూరిజం మినిస్టర్ చెప్పుకొచ్చారు. న్యూఇయర్ వేడుకలను గోవాలో జరుపుకునేందుకు దాదాపు డజను మంది స్నేహితులతో కలిసి ఇషా మంది డిసెంబర్ 26న గోవా వచ్చినట్లు తెలిస్తోంది. గోవాలోని కండోలిన్ బీచ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సంఘటనకు సంబంధించిన పోలీసులు ఆమె స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇషా మంత్రి మృతిపై ప్రతిపక్షాలు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె డ్రగ్స్ తీసుకుందని కొందరు అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











