twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో గౌరవం...ఉత్తమ చిత్రంగా ఎంపికైంది

    By Srikanya
    |

    ముంబై: విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'మేరీ కోమ్‌' చిత్రానికి మరో గౌరవం దక్కింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'మేరీ కోమ్‌' స్వీడన్‌లో జరిగిన స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం జూనియర్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ విషయమై చిత్రదర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ''మేరీ కోమ్‌'కు స్టాక్‌హోమ్‌ చిత్రోత్సవ అత్యున్నత పురస్కారమైన కాంస్య అశ్వ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. 9 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న బాలలు సభ్యులుగా ఉన్న జ్యూరీ మా చిత్రాన్ని ఎంపిక చేసింది'' అని చెప్పారు ఒమంగ్‌.

    ''టొరంటో చిత్రోత్సంలోనూ 'మేరీ కోమ్‌' ప్రదర్శితమైంది. గత సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది'' అని చెప్పారు ఒమంగ్‌. వచ్చే నెలలో స్వీడెన్‌లో జరిగే ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు ఆయన చెప్పారు. ''ఈ పురస్కారం ఇండియా, స్వీడెన్‌ల మధ్య వారధిగా నిలుస్తుంది. ఇక మీదట మన చిత్రాలను స్వీడన్‌లోనూ విడుదల చేసుకోవచ్చు'' అని చెప్పారు ఒమంగ్‌ కుమార్‌.

    చిత్రం కథేమిటంటే...

    Mary Kom wins best film at Stockholm International Film Fest

    మణిపూర్ ప్రాంతంలోని పల్లెటూరుకు చెందిన అమ్మాయి మేరీ కోమ్(ప్రియాంక చోప్రా). బాక్సింగ్ అంటే ఆసక్తి. తాను కూడా గొప్ప బాక్సర్ కావాలని, దేశానికి ఒలంపిక్ మెడల్ సాధించాలని కలలు కంటూ ఉంటుంది. బాక్సింగ్ అంటేనే పురుషాధిప్యం ఉన్న క్రీడ. అలాంటి క్రీడలో అమ్మాయిలు ఎంటరవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో ఇటు ఇంట్లో, అటు సమాజంలోని పరిస్థితులు ఆమెను పూర్తిగా నిరాశకు గురి చేస్తాయి.

    ఆ క్రీడ వైపు వెళ్లడానికి తండ్రి నిరాకరిస్తాడు. తండ్రిని ఎదురించి బాక్సింగ్ రింగులోకి ఎంటరైన తర్వాత ఎన్నో అవామానాలు, ఆటు పోట్లు. చివరకు ఆమె లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది ఈ చిత్రం. మేరీ కోమ్ పాత్రను చాలెంజ్‌గా తీసుకున్నప్రియాంక చోప్రా తాను తప్ప ఆ పాత్ర మరెవరూ చేయలేరు అనేలా అద్భుతంగా నటించింది.

    దర్శకుడు ఓమంగ్ కుమార్‌కు ఇది తొలి సినిమానే అయినప్పటికీ....ఫర్వాలేదనిపించాడు. కొన్ని సన్నివేశాలను అద్భుతంగా హాండిల్ చేసాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. మేరీకోమ్ జీవితానికి సంబంధించిన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. స్పూర్తి దాయకంగా ఈచిత్రాన్ని మలిచారు.

    ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.

    ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది.

    English summary
    Priyanka Chopra-starrer Mary Kom, directed by Omung Kumar, has been named best film at the Stockholm International Film Festival Junior in Sweden. The biopic, based on the life of Olympic medal-winning Indian boxer Mary Kom, was awarded the Bronze Horse award, the highest honour of the festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X