‘మర్యాద రామన్న’కు 123కేంద్రాల్లో అర్థశతదినోత్సవం...
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కామెడి కింగ్ సునీల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై సోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన 'మర్యాద రామన్న" సెప్టెంర్ 10కి విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సోభు యార్లగడ్డ మాట్లాడుతూ 'మర్యాద రామన్న" చిత్రం ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో 123కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మంచి కలెక్షన్స్ తో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. మాసంస్థకు ఇంత మంచి హిట్ ఇచ్చిన మా దర్శకులు రాజమౌళి గారికి, ఎమ్ ఎమ్ కీరవాణి గారికి, సునీల్ గారికి టోటల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెపుతున్నాం. అలాగే 'మర్యాద రామన్న" కు అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకలోకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.
మర్యాద రామన్న సునీల్ సలోని రాజమౌళి ప్రసాద్ దేవినేని maryada ramanna sunil saloni rajamouli prasad devineni


Click it and Unblock the Notifications