'మర్యాద రామన్న' సలోని నెక్ట్స్ సినిమా ఇదే

By Srikanya

"మర్యాద రామన్న" హిట్టుతో రీఎంట్రీ చేసిన సలోనీ తాజాగా 'తెలుగమ్మాయి' అనే చిత్రం కమిటయింది. ఈ చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో విక్రమ్, యశ్వంత్, హర్ష, సాయిచంద్ హీరోలుగా నటిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో వైష్ణవీ మూవీస్ పతాకంపై హరిరామజోగయ్య, కరాటం రాంబాబు నిర్మాణ సారధ్యంలో వానపల్లి బాబూరావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన తోలి దృశ్యానికి దాసరి నారాయణరావు క్లాప్ నివ్వగా వివి వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తోలి సన్నివేశానికి బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ 'హాస్యం, వినోదం మేళవించి తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ స్టొరీ ఇది. నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయికి మధ్య సాగే కధ' అన్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని హరిరామ జోగయ్య అన్నారు. షఫీ, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, జీవా, కొండవలస, షియాజీ షిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: అన్నట శ్రీరాజ్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్: గౌతంరాజు, కథ, కథనం, దర్శకత్వం రాజా వన్నెంరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X