వారం తిరక్కముందే 'మర్యాద రామన్న' మొదలెట్టేసాడు
ఈ నెల 23న 325 ప్రింట్లతో విడుదలైన 'మర్యాదరామన్న'చిత్రం విజయవంతం అయిన సందర్భంగా చిత్ర యూనిట్ మర్యాద యాత్రలను ప్రారంభించింది. మర్యాద పూర్వ కంగా సాగే ఈ యాత్ర హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ సాగుతుంది. టూర్‌లో సునీల్,సలోని, రాజమౌళి, కీరవాణి, రమా రాజమౌళి, నాగినీడు(విలన్) తదితర యూనిట్ సభ్యులు దారిపొడవునా ప్రేక్షకుల్ని పలకరిస్తారు. సినిమాపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. ఈనెల 26 ఉద యం 7గంకు హైదరాబాద్‌లో బయలుదేరి కర్నూలు, నంద్యాల మీదుగా తిరుపతి చేరుకుని, 27న అక్కడినుంచి బయల్దేరి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ పర్యటిస్తారు. 28 ఉదయం విజయవాడలో మొదలై గుడివాడ, భీమవరం (సునీల్ సొంతూరు), తణుకు, కాకినాడ, తుని, వైజాగ్ పర్యటిస్తారు. జూలై 29న అక్క డినుంచి తిరుగు ప్రయాణమై రాజమండ్రి, ఖమ్మం మీదుగా, వరంగల్ వచ్చి హైదరాబాద్ చేరుకుంటారు. సునీల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన చిత్రం 'మర్యాదరామన్న'. 24న మరో 20 అదనపు ప్రింట్లను తీసి పంపారు.


Click it and Unblock the Notifications











