ముస్తాబై వస్తున్న 'మర్యాద రామన్న' (ప్రివ్యూ)
ప్రపంచవ్యాప్తంగా 300 ప్రింట్లతో ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. రాజమౌళి టేకింగ్, సునీల్ పెర్ఫార్మెన్స్, కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని చాలా పెద్ద రేంజ్‌కు తీసుకెళ్తాయని మా నమ్మకం' అంన్నారు 'మర్యాదరామన్న'నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. సునీల్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న 'మర్యాదరామన్న' చిత్రం సెన్సార్ పూర్తి చేసికుని రేపు విడుదల కాబోతోంది.
సలోని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగినీడు, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, వేణుగోపాల్, ప్రభాకర్, కాంచీ, అనూజ్ గుర్వార్, జయవాణి, సంధ్య, అనితానాథ్, వినయ్, బేబి రిషిక, మాస్టర్ సాద్విక్ ఇతర ముఖ్య తారాగణం. ఇక ఈ చిత్రం కథను రాజమౌళి ముందే రివిల్ చేసారు.ఆయన మాటల్లోనే.."పాత కక్షల నేపథ్యంలో తను కనిపిస్తే చంపేద్దామని ఎదురుచూస్తున్న విలన్ ఇంటికే హీరో అతిథిగా వెళ్తాడు.
ఆ ఇంట్లో ఉన్నంతసేపూ అతను అతిథి దేవుడే. గుమ్మం దాటితే శత్రువు. విలన్ ఇంట్లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? అక్కడి నుంచి బయటపడ్డాడా లేదా అనే విషయం వినోదాత్మకంగా చెబుతున్నాం. హింస, రక్తపాతం లాంటివి మచ్చుకైనా కనిపించవు. నేనే పూర్తిగా సునీల్ శైలిలోకి మారి తీసిన సినిమా ఇది". అలాగే ఈ చిత్రంలో సునీల్..రాము అనే పాత్రను పోషిస్తున్నాడు. రైస్ మిల్లులో పనిచేసుకునే అతనికి పెద్దగా సంపాదన కానీ ఆస్తికాని ఉండదు. అతనికి ఉన్న ఒకే ఒక ఆస్ది ఆప్తమిత్రుడు సైకిల్. దాని పుణ్యమా అనే అతని ఉద్యోగం ఊడుతుంది. అయితే ఓ రోజు తన తాతలనాటి ఆస్ధి రాయలసీమలో ఉందని తెలుస్తుంది. దాంతో ఆనందంగా అక్కడకి బయిలుదేరతాడు.అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. బెస్టాఫ్ లక్ మర్యాదరామన్న.


Click it and Unblock the Notifications











