For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మర్యాద రామన్న’ సెప్టెంబర్ చివరన ఆరంభం

    By Staff
    |

    నిర్మాత తనకి స్వేచ్ఛనిస్తే...తన మీద నమ్మకముంచి ఎంతయినా ఖర్ఛు చేస్తే...తెలుగు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే సినిమాను తీస్తానని రాజమౌళి 'మగధీర" సాక్షిగా నిరూపించాడు. టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ గా మగధీర సరికొత్త రికార్ఢులు లిఖిస్తూ...ఇప్పట్లో మరెవరికీ అందనంత ఎత్తులో ఫైనల్ కౌంట్ని వుంచే రేంజ్ కి వెళుతోంటే...రాజమౌళి మాత్రం కూల్ గా తన నెక్స్ ట్ మూవీ స్ర్కిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు.'మగధీర" తర్వాత ఏ పెద్ద హీరోతో సినిమా చేసినా ఆ సినిమాపై వుండే అంచనాలు అంబరాన్ని దాటిపోతాయని ముందే గ్రహించి, తెలివిగా సునీల్ లో 'మర్యాద రామన్న" సినిమా మొదలు పోట్టిన రాజమౌళి సేఫ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడనిపించుకుంటున్నాడు. మగధీరతో 'వాట్ నెక్స్ ట్"? అనే ప్రశ్న ఉత్పన్నమవగా.......ఆ ప్రశ్నకి సమాధానం దాటవేసి సునీల్ సినిమా సెట్ చేశాడు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఇంత స్ట్రెస్ వుండదని భావించి ఇలా ప్లాన్ చేశాడు. రాజమౌళి సినిమా తీమడంలోనే కాక కెరీర్ ప్లానింగ్ లోను చాలా తెలివైనవాడని ఇప్పుడు పరిశ్రమ వాసులంతా ప్రశంసిస్తున్నారు.

    సునీల్ హీరోగా సలోని కథానాయికగా రాజమౌళి దర్శకత్వంలో రూపోందనున్న 'మర్యాదరామన్న" చిత్రం ఈ నెల 20న ఆరంభంకానుంది. ఎప్పుడు తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన కథలతో సినిమాలు చేసే రాజమౌళి ఈసారి తన తండ్రి దగ్గర సహాయకుడిగా వ్యవహరిస్తోన్న కాంచీ ఇచ్చిన కథతో ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన బేసిక్ ఐడియా ముళ్ళపూడి వరది అట. ఆ ఐడియాని కాంచీ డెవలప్ చేసాడు. ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు కెమెరామెన్ గా వ్యవహరించనున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X