'పెద్దలకు మాత్రమే' నుంచి తొలిసారి తప్పుకున్న రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రాలన్నిటికీ ఎ సర్టిఫికేట్ కంపల్సరీ. అయితే ఆయన తొలిసారిగా సునీల్ హీరోగా రూపొందించిన మర్యాదరామన్న చిత్రానికి యు సర్టిఫికేట్ సంపాదించారు. సెన్సార్ వారు చిత్రం చూసి చాలా ముచ్చటపడ్డారని, క్లీన్ గా రూపొందించారని, ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని రాజమౌళి ధీమాగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకూ ఆయన రూపొందించిన ఎనిమిది చిత్రాలకు ఎ సర్టిఫికేట్ రావటం,ఈ చిత్రానికి యు సర్టిఫికెట్ రావటం ఓ విశేషం గా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు,రక్తపాతం ఉండవని హామీ ఇస్తున్నారు కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రం చూసే అవకాసం ఉంది. రాజమౌళి అభిమానులు మాత్రమే కాక ఇలా అన్ని వర్గాలు వారు వస్తే ఓ రేంజిలో ఆడుతుందని నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నారు.ఈ వారం లోనే రిలీజు అవుతున్న ఈ చిత్రంలో సునీల్ సరసన సలోనీ హీరోయిన్ గా చేసింది. ఫ్యాక్షన్ నేఫద్యంలో కామిడీగా ఈ చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











