అజయ్ దేవగన్ ఇంకో తెలుగు రీమేక్ తో...
బాలీవుడ్ దృష్టి మొత్తం ఇప్పుడు సౌత్ సినిమాపై ఉంది. సినిమా బాగుంటే చాలు వెంటనే ఎంతైనా రీమేక్ రైట్స్ చెల్లించి ఎత్తుకుపోతున్నారు. ఆ నేపధ్యంలో సింగం రీమేక్ లో చేస్తున్న అజయ్ దేవగన్ ఆ సినిమా పూర్తవటంతో నెక్ట్స్ రీమేక్ కి రెడి అవుతున్నాడు. ఆ చిత్రం సునీల్ హీరోగా చేసిన మర్యాద రామన్న చిత్రం. రాజమౌళి, సునీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా రూపొంది మంచి విజయం సాధించింది. దాంతో మంచి రేటు ఇచ్చి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. ఆ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభిస్తామంటున్నారు.ఇక సింగం చిత్రం ఈ నెల 22న విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











