‘సన్ ఆఫ్ సర్దార్’గా మర్యాద రామన్న
రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన 'మర్యాద రామన్న' చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించడంతో పాటు, అప్పటి వరకు కమెడియన్‌గా ఉన్న సునీల్‌ను హీరోగా నిలబెట్టింది. తాజాగా ఈచిత్రం హిందీలో 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ అవుతోంది.
హిందీలో ఈచిత్రానికి అశ్విని ధర్ దర్శకత్వం వహిస్తుండగా అజయ్ దేవగన్ స్వయంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, జుహి చావ్లా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 13న దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.
తెలుగులో విడుదలైన 'మర్యాద రామన్న' చిత్రం మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా దెబ్బతో సునీల్ దశ తిరిగింది. కామెడియన్ వేషాలు మానేసి హీరోగా టర్న్ అయ్యాడు. ఈచిత్రం తర్వాత సునీల్ కు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో అవకాశం వచ్చింది.
అయితే ఆ చిత్రం ప్లాపవడంతో కామెడీ ప్రధానమైన సినిమాలపై దృష్టి పెట్టిన సునీల్ 'పూల రంగడు' చిత్రం ద్వారా మళ్లీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సునీల్ హిందీ మూవీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్ వరుసగా రెండోసారి ఇషా చావ్లాతోనే జతకడుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











