'మర్యాద రామన్న' కామిడీ ఎక్సపెరమెంట్: రాజమౌళి
'మర్యాద రామన్న' చిత్రం ఓ కామిడీ ఫిల్మ్, అలాగని అదేమీ స్లాఫ్ స్టిక్ కామిడీ కాదు. అలాగే నేను నా తరహా చిత్రం కాదు. చూద్దాం ఈ ఎక్సపెరిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో అంటున్నారు రాజమౌళి తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ. ఇక మహేష్ చిత్రం గురించి చెబుతూ..మేము ఇద్దరం కలసి ఓ చిత్రం చేయాలని స్ట్రాటజిల్ గా ఎగ్రీ అయ్యాం. అయితే మెటిరిలైజ్ అవ్వటానికి టైమ్ పడుతుంది. అయితే ఎలాంటి సినిమా చేయమంటారు...సజెషన్స్ ఇవ్వండి అన్నారు. ఇక సునీల్ తో చేస్తున్న చిత్రంలో హీరోయిన్ గా సలోని చేస్తోంది. అందాల రాముడు చిత్రం తర్వాత సునీల్ రెండో సారి హీరోగా నటిస్తున్న 'మర్యాద రామన్న" క్యారెక్టర్లన్నీ కామెడీతో అనుసంబంధానమై హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది.
ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న చిత్రం ఫుల్ కామిడి ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించ బడుతున్నది. ఈ చిత్రంలో సలోని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి మంచి సంగీతాన్ని అందించారు. ఎప్పుడు తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన కథలతో సినిమాలు చేసే రాజమౌళి ఈసారి తన తండ్రి దగ్గర సహాయకుడిగా వ్యవహరిస్తోన్న కాంచీ ఇచ్చిన కథతో ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన బేసిక్ ఐడియా ముళ్ళపూడి వరది అట. ఆ ఐడియాని కాంచీ డెవలప్ చేసాడు. ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు కెమెరామెన్ గా వ్యవహరించనున్నాడు.


Click it and Unblock the Notifications











