రాజమౌళితో చెయ్యపడ్డా...పాపం కలిసిరాలేదామెకు
రాజమౌళి లేటెస్ట్ చిత్రం మర్యాదరామన్న లో రీ ఎంట్రీ ఇచ్చిన సలోనికి కాలం కలిసివచ్చినట్లు లేదు. సినిమా విజయవంతమైనా ఆమెకు ఒక్క అవకాశమూ రాలేదు. అప్పటికీ సలోని..టీవీల్లో కనిపించి హంగామా చేసింది కానీ ఆ వ్యూహం ఫలించలేదు. నిజానికి రాజమౌళి సినిమా రిలీజ్ కాగానే ఆమెకు వరస ఆఫర్స్ వస్తాయని మీడియా రాసేసింది. అలాగే ఆమె కూడా ఆసలు పెట్టుకుంది. వీటికి తోడు సలోని అద్బుతమైన నటి...మర్యాద రామన్నలో అదరకొట్టేసింది అంటూ రాజమౌళి కూడా మీడియాలో ఊదరకొట్టారు. ఫలితం శూన్యం. ఇక సలోని గతంలో..ధన 51, ఒక ఊరిలో, కోకిల చిత్రాలు చేసింది. అయితే అవేమీ ఆమెను భాక్సాఫీస్ వద్ద నిలబెట్టలేకపోయాయి. మర్యాదరామన్న చిత్రంతో ఆమెకు క్రేజ్ వచ్చింది.అదీ ఉపయోగపడలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











