‘మర్యాద రామన్న’కి ఒక్కరోజులోనే మూడున్నర కోట్ల షేర్..!
రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర" తర్వాత రాజమౌళి తాజా చిత్రం 'మర్యాద రామన్న" సృష్టించిన సంచలనమిది. 325 ప్రింట్స్ తో 415 థియేటర్లలో విడుదలైన 'మర్యాద రామన్న" పెద్ద హీరోల సినిమాలకు వచ్చే స్థాయిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి తొలి రోజునే మూడున్నర కోట్ల రూపాయల షేర్ ను సాధించడం విశేషం. వరుసగా భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఎక్కువ రేట్లు పెట్టి కొన్న 'మర్యాద రామన్న" ఏం చేస్తాడోనని కాస్త కంగారుపడ్డ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇప్పుడీ సినిమాకి లభిస్తోన్న స్పందన చూసి బాగా రిలాక్స్ అయిపోయారు. కంప్లీట్ గా సేఫ్ అయిపోతామని అంటున్నారు. తన పేరుతో భారీ ఓపెనింగ్స్ ని రప్పించడమే కాక..సినిమాలోనూ తనదైన ముద్రని మరోసారి చూపించి మళ్ళీ మాంఛి కమర్షియల్ హిట్టు కొట్టిన రాజమౌళికే ఈ సక్సెస్ క్రెడిట్ చెందుతుందంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందిప్పుడు..!
మర్యాద రామన్న సునీల్ సలోని రాజమౌళి మగధీర రామ్ చరణ్ తేజ్ maryada ramanna saloni sunil rajamouli magadheera ram charan teja


Click it and Unblock the Notifications