ముగ్గురు ఐటం లేడీస్‌తో వేడిపుట్టించనున్న రాణా
రాణా-జెనీలియా జంటగా ప్రకాష్ తోలేడీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా ఇష్టం'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఒక్క ఐటం సాంగు మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. ఈ ఐటం సాంగు ఈ సంవత్సరం టాప్ రేంజ్ ఐటం సాంగుల్లో ఒకటిగా నిలవాలనే ఉద్దేశ్యంతో ముగ్గురు భామాలతో హాట్ హాట్ స్టెప్పులు వేయించాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు మరియమ్ జకారియా, హంసానందినితో పాటు మరో హాట్ లేడీని ఎంపిక చేసినట్లు దర్వకుడు ప్రకాష్ తోలేటి వెల్లడించారు.
ఈచిత్రంలో రాణా సరసన జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కృష్ణ వేణిగా కనిపించి మురిపించనుంది. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిలో బ్రహ్మానందం, నాజర్, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, అలి, ఉత్తేజ్ ప్రగతి తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు రాణా క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జద్గురుమ్' చిత్రంలోనూ నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











