Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
క్రికెటర్‌తో అమ్మ రిలేషన్.. స్కూల్లో నాకు నేనే అసహ్యించుకొనేలా..
తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు, అఫైర్లు తదితర అంశాలు వారి పిల్లలపై మంచిగానో, చెడుగానో తీవ్ర ప్రభావం చూపుతాయి. సమాజంలో చిన్నచూపు, స్కూల్లో తోటి విద్యార్థుల సూటిపోటి మాటలు పిల్లల మనసులను గాయపరుస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని ప్రముఖ నటి నీనా గుప్తా, ప్రముఖ క్రికెటర్ వీవియన్ రిచర్డ్స్ కూతురు మసాబా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఆమెకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయంటే..
నీనా, రిచర్డ్స్ అఫైర్
ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తా అఫైర్ 80, 90 దశకాల్లో సంచలనం. పెళ్లి కాకుండానే రిచర్డ్స్ ద్వారా నీనా గుప్తా మసాబాను కనడం సెన్సేషనల్ వార్తగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల కాలం తర్వాత నీనా గుప్తా, రిచర్డ్స్ రిలేషన్ బ్రేకప్ అయింది. వారి కుమార్తె మసాబా ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
నా తండ్రి కారణంగా
ఇటీవల మసాబా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. తన తండ్రి వెస్టిండీస్‌కు చెందిన వారు కావడం వల్ల నా దేహం అందరి ఆడపిల్లలకంటే భిన్నంగా ఉంటుంది. నా శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తుంది. సమాజ వివక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని మసాబా పేర్కొన్నది.
స్కూల్లో తోటి విద్యార్థులతో
స్కూల్లో తోటి విద్యార్థులతో ఎదురైన పరిస్థితులను వెల్లడిస్తూ.. ఫుల్లుగా కండపట్టి నా బుగ్గలు ఉండేది. నాకు హ్యాపీగానే ఉన్నా తోటి విద్యార్థులు పెద్దగా నన్ను పట్టించుకొనే వారు కాదు. కానీ నా తండ్రి కరేబియన్ కావడంతో దేహం లక్షణాలు అలానే ఉండేవి. అదే నాకు చాలా బాధగా ఉండేది. కొన్నిసార్లు నా శరీరాన్ని చూసుకొనే స్వయంగా నేను అసహ్యించుకొనే దానిని అని మసాబా తన కష్టాలను వెల్లడించింది.
Recommended Video
|
లాక్డౌన్ సమయంలో
నా తండ్రి జీన్స్ నాకు కష్టాలే తెచ్చిపెట్టాయి. అమ్మాయిల చేతుల మాదిరిగా నా చేతులు సున్నితంగా ఉండేవి కాదు. ఈ లాక్డౌన్ పిరియడ్‌లో గత 30 రోజుల్లో దాదాపు 27 రోజులు వర్కవుట్లకే కేటాయించాను. అలాగా అని నేను ఓవర్ వెయిట్ కాదు. నాకు ఆహారపరమైన సమస్యలు ఏమీలేవు అని మసాబా గుప్తా తన భావాలను పంచుకొన్నారు.