twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్-రామ్ ‘మసాలా’ సెన్సార్ టాక్ సూపర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వెంకటేష్, రామ్ ప్రధాన పాత్రల్లో విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం 'మసాలా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది. నవంబర్ 14న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందుతోంది. వెంకటేష్‌, రామ్‌ సరసన అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌ నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పకులు. మరి ఈ సినిమాకు సెన్సార్ టాక్ ఎలా ఉందనే విషయమై ఓ లుక్కేద్దాం...

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మొత్తం రన్నింగ్ టైం 145 నిమిషాలు. ఇద్దరు హీరోలను ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఫోకస్ చేసారు. వెంకటేష్, రామ్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమా ప్లస్సవుతుందనే టాక్ వినిపిస్తోంది. పాటలన్నీ ఎంతో అందంగా చిత్రీకరించారట.

    సినిమా మొత్తం ఫుల్ కామెడీతో వినోద ప్రధానంగా సాగిందని, వెంకటేష్, రామ్ తమ కెరీర్లోనే బెస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చారని, సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా సాగుతోందని, నిర్మాణ విలువలు బాగున్నాయని....హిందీలో హిట్టయిన సినిమాకు రీమేక్ కావడం, వెంకీ, రామ్ లాంటి స్టార్లు నటించడంతో సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.

    English summary
    
 Venkatesh, Ram starrer 'Masala' completed its censor formalities today. The censor board after watching the film has given Clean “U” certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X