కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం:రామ్
రామ్ ట్వీట్ లో... కంటెంట్ రెడీ అయ్యాక కంట్రోలు చేసుకోవడం చాలా కష్టం....మా సినిమాని మీ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకువస్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను...ఆడియో,సినిమా రిలీజ్ లు ఎప్పుడు అని అడిగుతున్నారు. మేము అంతా రెడీ అయిపోయాము... స్టేట్ లో ఇష్యూలు సెటిల్ అయితే మాకు క్లారిటీ వస్తుంది... అన్నారు.
రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్.
సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. 'మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications












