జీవా ‘మాస్క్’ ఆగస్టు 31న
హైదరాబాద్: ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లి. పతాకంపై జీవా కథానాయకుడుగా నిర్మిస్తున్న చిత్రం 'మాస్క్'. మిస్కిన్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 31న విడుదలకు సిద్ధం అవుతోంది.
సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ...మాస్క్ చిత్రం మీద ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈచిత్రం అలరిస్తుంది. ఈ మధ్యనే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు మిస్కిన్ గతంలో మంచి హిట్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని యూత్ కు నచ్చేలా తీసారని తెలిపారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- జీవా సరికొత్తగా ఈ చిత్రంలో కన్పిస్తారని, కుంగ్‌ఫూ, బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్‌తో చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని, తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని, ఇంతవరకూ జీవా ధరించని ఓ విభిన్నమైన పాత్ర ఈ చిత్రంలో ఉంటుందని తెలిపారు.
జీవా సరసన పూజా హెడ్గే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, గిరీష్ కర్నాడ్, నరేన్, అనుపమ్ ఖేర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:కె, మాటలు:శశాంక్ వెన్నెల కంటికంటి, పాటలు: భువనచంద్ర, వనమాలి, రాకేందు వౌళి, కెమెరా:సత్య, ఎడిటింగ్:గౌగిన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు:ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మిస్కిన్.


Click it and Unblock the Notifications











