మాస్ సినిమాలకు కాలం చెల్లిందంటున్న స్టార్ హీరో
తన కెరీర్ ని మాస్ హీరో వైపుగా మల్చుకుని భాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడొక కొత్త సిద్ధాంతం చెబుతున్నాడు. 'మాస్ మసాలా సినిమాలకు త్వరలోనే కాలం చెల్లిపోతుంది'అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. 'వాంటెడ్', 'రెడీ', 'దబాంగ్' లాంటి మాస్ సినిమాలతో అభిమానులను అలరించిన సల్మాన్ ఇలా కొత్త పల్లవి అందుకోవడం చిత్రమే అంటున్నారు.
నిజానికి సల్మాన్, దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కలిసి 2009లో చేసిన 'వాంటెడ్'(పోకిరి రీమేక్) సినిమా సరికొత్త రకం మాస్ మసాలా చిత్రాలకు నాంది పలికిందని చెప్పొచ్చు. ఈ సినిమా రూ. 160 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు సూత్రాలను తిరగరాసింది. ఆ తర్వాత సల్మాన్ 'రెడీ', 'దబాంగ్', 'బాడీగార్డ్', 'ఏక్‌థా టైగర్', 'దబాంగ్2' అతడిని కాసులు రాల్చే గనిగా మార్చేశాయి.
ఈ స్టేట్ మెంట్ విన్న వారు మరి అతడి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు. 'జయహో'', 'కిక్'లతో పాటు సూరజ్ బర్జాత్యా, ప్రభుదేవా సినిమాలతో సల్మాన్ బిజీగా ఉన్నాడు. 'వీటిలో 'జయహో' విభిన్నమైనది. డ్రామా, ఎమోషన్లు ఉంటాయి. 'కిక్' కూడా భిన్నమైనదే. ''సూరజ్ చెప్పిన కథ కూడా నాకు భలే నచ్చింది'' అంటున్నాడు సల్మాన్. ఇవన్నీ పబ్లిసిటీకి అంటున్న మాటలా, లేక రాబోయే ట్రెండ్ ని గమనించే అంటున్నాడా అనేది అతడి కొత్త సినిమాలు చూస్తే కానీ తెలియదు.


Click it and Unblock the Notifications












