twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్‌ సినిమాలకు కాలం చెల్లిందంటున్న స్టార్ హీరో

    By Srikanya
    |

    ముంబై : ''ఇలాంటి సినిమాలు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఇక జనాలకు విసుగు రావడం ఖాయం. ఇలాంటి సినిమాలకు ప్రాచుర్యం బాగానే ఉన్నా, రానురాను సృజనాత్మకత తగ్గిపోతోంది. ఒకే రకం విషయాలతో పదే పదే సినిమాని తీసేస్తున్నారు. ఓ మనిషి 50 మందిని దడదడా కొట్టేయడం, వాళ్లంతా గాల్లోకి ఎగిరిపోవడం ఇలాంటి సినిమాల్లో కనిపిస్తోంది. కానీ ఎందుకు కొడుతున్నాడు, ఎలా కొడుతున్నాడనే దానికి కారణం ఉండాలి. ఇలాంటి యాక్షన్‌ దృశ్యాలు మారిపోతాయని అనిపిస్తోంది'' అంటూ విశ్లేషిస్తున్నాడు సల్మాన్‌.

    తన కెరీర్ ని మాస్‌ హీరో వైపుగా మల్చుకుని భాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడొక కొత్త సిద్ధాంతం చెబుతున్నాడు. 'మాస్‌ మసాలా సినిమాలకు త్వరలోనే కాలం చెల్లిపోతుంది'అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. 'వాంటెడ్‌', 'రెడీ', 'దబాంగ్‌' లాంటి మాస్‌ సినిమాలతో అభిమానులను అలరించిన సల్మాన్‌ ఇలా కొత్త పల్లవి అందుకోవడం చిత్రమే అంటున్నారు.

    నిజానికి సల్మాన్‌, దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా కలిసి 2009లో చేసిన 'వాంటెడ్‌'(పోకిరి రీమేక్) సినిమా సరికొత్త రకం మాస్‌ మసాలా చిత్రాలకు నాంది పలికిందని చెప్పొచ్చు. ఈ సినిమా రూ. 160 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు సూత్రాలను తిరగరాసింది. ఆ తర్వాత సల్మాన్‌ 'రెడీ', 'దబాంగ్‌', 'బాడీగార్డ్‌', 'ఏక్‌థా టైగర్‌', 'దబాంగ్‌2' అతడిని కాసులు రాల్చే గనిగా మార్చేశాయి.

    ఈ స్టేట్ మెంట్ విన్న వారు మరి అతడి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు. 'జయహో'', 'కిక్‌'లతో పాటు సూరజ్‌ బర్జాత్యా, ప్రభుదేవా సినిమాలతో సల్మాన్‌ బిజీగా ఉన్నాడు. 'వీటిలో 'జయహో' విభిన్నమైనది. డ్రామా, ఎమోషన్లు ఉంటాయి. 'కిక్‌' కూడా భిన్నమైనదే. ''సూరజ్‌ చెప్పిన కథ కూడా నాకు భలే నచ్చింది'' అంటున్నాడు సల్మాన్‌. ఇవన్నీ పబ్లిసిటీకి అంటున్న మాటలా, లేక రాబోయే ట్రెండ్‌ ని గమనించే అంటున్నాడా అనేది అతడి కొత్త సినిమాలు చూస్తే కానీ తెలియదు.

    English summary
    Salman Khan, who brought mass entertainers back to life with films like Wanted, Ready and Dabangg, feels that this space might die soon as it is now being overdone."This space will die totally. I think this was a beautiful format where we had films like 'Wanted', Dabangg etc. Now everybody has overdone it so much that it might die away. These kinds of films are popular but the creativity is becoming less... It seems the same stuff is happening (every time in these films). I don't know which genre will click now," Salman told .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X