చంటిగాడి నెక్ట్స్ టార్గెట్ అందాల ముద్దు బొద్దుగుమ్మనే..!?
ఇలియానాతో తొలిసారి చేసిన చిత్రం 'ఖతర్నాక్" అడ్డగోలుగా ప్లాప్ అవ్వడంతో రెండో చిత్రం చేయడానికి ముందు కొంచెం ఆలోచించిన రవితేజ..లాభం, నష్టం ఏ 'కిక్" వచ్చినా దర్శకనిర్మాతలకే కదా! అని చెప్పి ఇలియానాతో ఇరగదీస్తే అది బంఫర్ హిట్ అయింది. అలాగే శ్రియతో తొలిసారి చేసిన చిత్రం 'భగీరథ" బంపర్ ప్లాప్ అవ్వడంతో ఇలియానాతో చేసిన రెండో చిత్రం బాగా కలిసి వచ్చింది..కాబట్టి..శ్రియతో రెండోసారి చేసినా కలిసి రావచ్చు..కలిసి రాకపోయినా మొదట మనం అనుకున్నం కదా! దానికి ఫిక్స్ అయిపోదాం అని భావించి 'డాన్ శీను" కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది డాన్లీ హిట్ గా దూసుకుపోతుంది.
ఈ రెండు చూశాక..రవితేజ కూడా ఓ నిర్ణయానికి వచ్చేశాడట..తనతో తొలి చిత్రం చేసి అవి అట్టర్ ప్లాప్ అయిన హీరోయిన్ ల లిస్ట్ బయటికి తీసి మరీ యాక్ట్ చేయాలని అనుకుంటున్నాడట..అలా అయితే రవితేజ నెక్ట్స్ టార్గెట్ అందాల ముద్దు బొద్దుగుమ్మ ఛార్మీనే. ఛార్మీతో చేసిన 'చంటి(దహీరో)"ఘోరంగా ప్లాప్ అయిందిగా..తనతో తర్వాత చిత్రం చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని భావించి చార్మిని లైన్ పెట్టమని నిర్మాతలకు సూచిస్తున్నాడట ఈ డాన్ శీను..


Click it and Unblock the Notifications











