ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు, రవితేజ ఇలా చేయటం సరికాదు: తమిళ దర్శకుడి ఆవేదన
తమిళంలో సూపర్ హిట్ అయిన బోగన్ సినిమా తెలుగు రీమేక్ కి రవితేజ ముందు ఒప్పుకుని తర్వాత నో చెప్పడం కోలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్‌ను చాలా నిరుత్సాహపరిచిందట.
చాలా రోజుల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా అందించిన జోష్‌తో రవితేజ వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన బోగన్ సినిమా తెలుగు రీమేక్‌లో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు వార్తలుకూడా వచ్చాయి.
Recommended Video


భోగన్ తెలుగు రీమేక్
జయం రవి, హన్సిక, అక్షర కాంబినేషన్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం భోగన్. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ వెర్షన్ కి దర్శకత్వం ఆహించిన లక్ష్మణ్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ వార్తలు కొంతకాలంగా పరిశ్రమలో సందడి చేశాయి.

ప్రాజెక్ట్ కి నో చెప్పాడట
అయితే తాజాగా రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పాడని వార్తలు వచ్చాయి. రవితేజ ఈ సినిమాకి నో చెప్పడం కోలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్‌ను చాలా నిరుత్సాహపరిచిందట. దీని గురించి దర్శకుడు లక్ష్మణ్ ఓ తమిళ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్నెళ్లపాటు కష్టపడి
"బోగన్" తెలుగు రీమేక్‌లో నటించడానికి రవితేజ అంగీకరించారు. దీంతో ఆర్నెళ్లపాటు కష్టపడి రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు స్క్రిప్టులో మార్పులు చేశాను. ఇక, షూటింగ్ మొదలు కావడమే తరువాయి అనగా రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకోవడం నన్ను నిరాశకు గురి చేసింది.

ఏమి చేయాలో అర్థం కావడం లేదు
దీంతో ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అంతా ఓకే అనుకున్నాక ఇలా చేయడం సరికాద"ని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. అదే స్క్రిప్ట్ ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడట. సినిమా స్క్రిప్ట్‌ను రవితేజ ఎనర్జీకి, తెలుగు ప్రజల అభిరుచికి తగ్గట్లుగా మార్చాడట.

రవితేజ నో చెప్పడంతో
ఈ చిత్రంలో రవితేజతో పాటు కేథరీన్ త్రెసాను కథానాయికగా తీసుకుందామని అనుకున్నారట. ఎస్‌జే సూర్యను అరవింద్ సామి రోల్‌కు తీసుకుందామనుకున్నట్లు తెలిసింది. అయితే రవితేజ నో చెప్పడంతో లక్ష్మణ్ తలపట్టుకున్నాడట. కాగా ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు.


Click it and Unblock the Notifications











