»   » షాకింగ్....రవితేజ బాడీ ఇలా అయిందేంటి? (ఫోటోస్)

షాకింగ్....రవితేజ బాడీ ఇలా అయిందేంటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తెలుగు హీరో రవితేజ బాడీలో చాలా మార్పులొచ్చాయి. 'కిక్-2' సినిమా ముందు వరకు రవితేజ బలిష్టంగా బలుపెక్కిన బాడీతో పర్ ఫెక్ట్ పర్సనాలిటీతో ఉండేవారు. అయితే 'కిక్-2' సినిమాలో రవితేజ బాగా చిక్క పోయిన కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా షాకయ్యారు.

రవితేజ చిక్కపోవడం చూసి ఆయనకు ఏమైనా అయిందేమోనని అనుమాన పడ్డ అభిమానులు సైతం ఉన్నారు. ఆయా సినిమా ప్రమోషన్లలో కూడా రవితేజకు ఈ విషయమై మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే తనకు ఏమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఫిట్ నెస్ మెయింటనెన్సులో భాగంగానే ఇలా స్లిమ్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇటీవల వచ్చిన 'బెంగాల్ టైగర్' మూవీలో కూడా రవితేజ సన్నగా కనిపించడం చాలా మందికి నచ్చలేదు.

తాజాగా... రవితేజకు సంబంధించిన షాకింగ్ ఫోటోస్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో రవితేజ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నారు. అయితే ఇవి రియల్ ఫోటోలా? లేక మార్పింగ్ ఫోటోలా? అనేది తేలాల్సి ఉంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

త్వరలో రవితేజ... 'అలా మొదలైంది' నిర్మాత దామోదర ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభించనున్నారు. తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్ గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ టైటిల్ ..సినిమాకు కిక్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు.

బెంగాల్ టైగర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ వేణు శ్రీరామ్ తో అనుకున్న 'ఎవడో ఒకడు' సినిమా ఆగిపోయింది. దిల్ రాజు తో కథా విషయంలో సెట్ కాకే ప్రాజెక్టు ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ లోనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. దాంతో వెంటనే మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాలని రవితేజ ఇలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినరని వినపడుతోంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో కలసి వర్క్ చేసేందుకు రవితేజ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది. ఆ రెండు చిత్రాలతో రవితేజ నటన కచ్చితంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రవితేజ

రవితేజ


రవితేజ సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోలు వెబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

రియలా? ఫేకా?

రియలా? ఫేకా?


అయితే ఈ ఫోటోలు రియల్ ఫోటోలా? ఫేక్ ఫోటోలా అనేది తెలియడం లేదు.

ఫ్యాన్స్

ఫ్యాన్స్


రవితేజ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

ప్రస్తుతం

ప్రస్తుతం


దర్శకుడు చక్రితో చేసే సినిమాతో పాటు...పూరి, సుధీర్ వర్మలతో పని చేసే అవకాశం ఉంది.

English summary
Here is the Exclusive Photo od Ravi Teja Six Pack with stunning muscles. The leaked picture has gone viral on the web.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu