బాలీవుడ్ స్టార్ హీరోతో రవితేజ మల్టీస్టారర్.. నిర్మాతగా రానా దగ్గుబాటి.. దర్శకుడు ఎవరంటే?
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ గ్రాఫ్ రివ్వును రాకెట్‌లా దూసుకెళ్తున్నది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాల ద్వారా పాన్ ఇండియా మార్కెట్‌ను క్రియేట్ చేసుకొన్నాడు. అయితే ప్రస్తుతం నేరుగా హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ హీరోతో చేయబోయే సినిమా ఏమిటి? ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు అనే విషయంలోకి వెళితే..
బ్లాక్ బస్టర్ హిట్స్‌తో రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ భారీ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. దాంతో రవితేజపై మంచి బెట్టింగ్ జరుగుతున్నది. నిర్మాతలు రవితేజతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.

రావణాసుర చిత్రంతో రెడీ
ప్రస్తుతం రవితేజ నటించిన రావణాసుర చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, దక్ష నాగార్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా
మాస్ మహారాజా కేవలం హీరోనే కాకుండా నిర్మాతగా కూడా సినిమాల్లో భాగమవుతున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే గట్టా కుస్తీ, రావణాసుర, చాంగురే బంగారు రాజా చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వర్రావు, ఈగల్ అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్‌లో ఎంట్రీకి రవితేజ రెడీ
అయితే వరుస ప్రాజెక్టులతో రవితేజ మూవీస్ చేస్తూనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. తమిళంలో భారీ విజయం సాధించిన మనోడు మూవీకి ఈ సినిమా రీమేక్. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రానా దగ్గుబాటి నిర్మాతగా తమిళ రీమేక్‌తో
బాలీవుడ్‌లో మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న మనోడు రీమేక్ చిత్రానికి టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమాను హిందీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు.
బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన టాలీవుడ్ హీరోలు
ఇదిలా ఉండగా, టాలీవుడ్ హీరోలందరూ హిందీలో చిత్రాలతో పాన్ ఇండియా సినిమాల్లో భాగం అవుతుండటం విశేషంగా మారింది. ఇప్పటికే వెంకటేష్, రాంచరణ్ కలిసి సల్మాన్ ఖాన్ నటించిన కిసి కీ భాయ్.. కిసీ కా జాన్ అనే చిత్రంలో కనిపించబోతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వార్ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2లో హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో భాగమయ్యారు. ఈ సినిమా వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











