రవితేజ నిప్పుకి చిచ్చర పిడగు సంగీతం..ఆడియో డిసెంబర్ 13న

By Sindhu

బొమ్మరిల్లు పతాకం పై వైవి ఎస్ చౌదరి నిర్మిస్తూ, రవితేజ హీరో గా నటిస్తున్న చిత్రం 'నిప్పు', ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదలకి సిద్దమవుతోంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఆడియోని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మాత వైవి ఎస్ చౌదరి మాట్లాడుతూ చూడాలనివుంది, "ఒక్కడు లాంటి సినిమాల ద్వార మణిశర్మ తో ఒక డిఫరెంట్ మ్యూజికల్ ట్రెండ్ ని క్రియేట్ చేసి మ్యూజిక్ పట్ల తనకు మంచి అవగాహనా వుంది అని మా దర్శకుడు గుణ శేఖర్ నిరూపించుకున్నాడు. సీతా రాముల కళ్యాణం నుండి సలీం వరకు విభిన్నమైన సంగీత దర్శకుల తో పని చేసి మంచి సంగీతం రాబట్టుకుని సంగీతం పట్ల నా టేస్ట్ ప్ర్రోవ్ చేసుకున్నా".

ఇలా సంగీతం పట్ల మంచి అవగాహనా మేము కలిసి చేస్తుండడంతో 'నిప్పు' ఆడియో మీద సినిమార్కేట్ లో, శ్రోతలలో అంచనాలు వుండడం సహజం. సిని సంగీత రంగం లోకి చిచ్చర పిడుగులా ప్రవేశించి తన సంగీతంతో అందరిని ఆకట్టుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముందుగా చెప్పినట్టు జనవరి 13న ఈచిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం". అని నిర్మాత చెప్పారు.

రవితేజ, దీక్షాసేథ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం తడి తరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కో-ప్రొడ్యూసర్:యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.విఎస్ చౌదరి, కథ:స్క్రీన్ ప్లే: దర్శకత్వం: గుణ శేఖ

ప్రస్తుతం 'నిప్పు' సినిమాలో నటిస్తున్న రవితేజ, మరోపక్క 'శౌర్యం' ఫేం శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ముహూర్తం కూడా ఆమధ్య హైదరాబాదులో జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యులు షూటింగు త్వరలో తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. కథలో కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రవితేజ పక్కన తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఆమధ్య 'వీర' సినిమాలో ఆమె రవితేజ పక్కన నటించిన సంగతి తెలిసిందే..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X