Tiger Nageshwara Rao Censor Review: టైగర్ నాగేశ్వరరావు సెన్సార్ టాక్ ఏంటంటే? రన్ టైమ్ ఎంతంటే?
Tiger Nageshwara Rao Censor Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లు చేస్తోంది. హీరోతో పాటు హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా రికార్డు:తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను 3 గంటల 2 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. అయితే ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా.. టైగర్ నాగేశ్వర రావు రికార్డు క్రియేట్ చేసింది. ఇంత ఎక్కున రన్ టైమ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. సినిమా చాలా బాగుంది, అన్నీ సీన్లు అద్భుతంగా ఉన్నాయి... వాటిలో ఏ ఒక్కదాన్ని తీసేయలేమని భావించినప్పుడు మాత్రమే సెన్సార్ బోర్డు రన్ టైమ్ ను ఎక్కువగా పెడుతుంది.

మాస్ మహారాజా హీరోగా చేసిన ఈ చిత్రం కూడా అద్భుతంగా ఉండడం వల్లే రన్ టైమ్ ఎక్కువ ఉందని చాలా మంది భావిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా అభిమానులకు ఫుల్ కిక్కిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అలాగే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందని అటు నటీనటులతో పాటు ఇటు దర్శక, నిర్మాతలూ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా సెన్సార్, ముఖ్యంగా రన్ టైమ్ గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది.
70వ దశకంలో స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు నిజ జీవితం ఆధారంగా వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో టైగర్ నాగేశ్వర రావు పాత్రలో రవితేజ కనిపిస్తుండగా.. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు కథానాయికలుగా కనిపించనున్నారు. అలాగే ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, నాజర్, జిషఉ సేన్ గుప్తా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. హీరో రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అంతా స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషలతో పాటు ఈ సినిమాను సంజ్ఞా భాష (సైన్లాంగ్వేజ్) లోనూ విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. ఇలా విడుదల కాబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











