సంక్రాంతి బరిలో రవితేజ 'నిప్పు'..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా బొమ్మరిల్లు పథాకంపై నిర్మితమౌతున్న చిత్రం 'నిప్పు" ఇప్పటి వరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వైవియస్ చైదరి నిర్మాతగా అవతారమెత్తిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. సింహా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం 'నిప్పు" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'వీర" తర్వాత టాలీవుడ్ మినిమమ్ గ్యారంటీ కథానాయకుడు రవితేజ నటిస్తున్న చిత్రం 'నిప్పు" గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీక్షాసేథ్ కథానాయిక, మిరపకాయ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రవితేజ, దీక్షాసేత్ కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవర్ ఫుల్ కథాంశానికి, హాస్యాన్ని మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రాన్ని చౌదరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఒక్క షెడ్యూల్ మినహా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరితగతిన తెరకెక్కించనున్నట్టు నిర్మాత తెలిపారు. జనవరి నాటకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
మహేష్ బాబుతో 'ఒక్కడు" వంటి బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ కు అందించిన గుణశేఖర్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా వైవియస్ చౌదరి నిర్మించనున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ముగ్గురు దిగ్గజాల నేతృత్వంలో తెరకెక్కుతున్న 'నిప్పు" ఎలాంటి సంచలనాలను సృష్టించనుందో చూడాలి మరి...


Click it and Unblock the Notifications











