Pawan Kalyan 'హరిహర వీరమల్లు' సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధం.. ఎన్నికలపై ఎఫెక్ట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓవైపు పాలిటిక్స్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు వరుస పెట్టి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అనేక సినిమాలను లైన్ లో పెట్టిన పవర్ స్టార్ ఇప్పటికే బ్రో షూటింగ్ పూర్తి చేశారు. దీనికి సంబంధించి వస్తున్న అప్డేట్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోని హరిహర వీరమల్లు సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అనుకోని విధంగా ఈ సినిమా సెట్స్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.

వరుస చిత్రాలు:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. తమిళ నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్ మూవీ బ్రో చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ రికార్డ్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు పవన్ కల్యాణ్.

Massive Fire Accident In Pawan Kalyan Hari Hara Veeramallu Sets

ఇంకా 25 శాతం:ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్-డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రానున్న చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా విడుదల చేద్దామనుకుంటున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అని టాక్. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రీకరణ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. ఇంకా 25 శాతం షూటింగ్ మిగిలి ఉంది. దానికి కనీం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Massive Fire Accident In Pawan Kalyan Hari Hara Veeramallu Sets

షాకిచ్చిన ప్రమాదం:ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు సంబంధించి ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాలనుకున్నారు. త్వరలో మూవీ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తాజాగా హరిహర వీరమల్లు సెట్స్‌లో తాజాగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇలా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం షాక్ కు గురిచేసింది.

Massive Fire Accident In Pawan Kalyan Hari Hara Veeramallu Sets

నిర్మాణానికి ప్రయత్నాలు:వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలో వేసిన సెట్ ఈ ప్రమాదంలో దగ్ధమైంది. అయితే అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ, హరిహర వీరమల్లు సెట్ మాత్రం పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. మళ్లీ ఆ సెట్ నిర్మించేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సెట్ నిర్మాణానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట.

Massive Fire Accident In Pawan Kalyan Hari Hara Veeramallu Sets

ఎన్నికలపై ఎఫెక్ట్:కాగా ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పవన్ ఎన్నికల వరకు అన్ని సినిమాలు పూర్తి చేద్దామనుకున్న సమయంలో ఇలా సెట్ కాలిపోవడం మేకర్స్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. ముందుగా అనుకున్న సమయానికంటే కాస్తా ఆలస్యంగానే షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ షూటింగ్ ప్రభావం ఎన్నికలపైన కూడా పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X