Prabhas: మరో అప్డేట్ ఇచ్చిన సలార్ టీమ్.. ఎవరు ఆ రాజమనార్ ?

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం సాహో సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంటాడని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సారి అంతకుమించి అనేలా హిట్స్ అందుకునేందుకు ప్రభాస్ సైలెంట్ గా పెద్ద సినిమాలతోనే సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ యాక్షన్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. రెగ్యులర్ గా కాకుండా మధ్యమధ్యలో కొన్ని విభిన్నమైన ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. వీలైనంతవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చూస్తుంటే ప్రభాస్ మార్కెట్ స్థాయి కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందని అని క్లారిటీ అయితే వచ్చేస్తోంది.

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం యాక్షన్ మూవీ సలార్ తో రాబోతున్నాడు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే సినిమాలో పాత్రలు కూడా కేజీఎఫ్ తరహాలోనే చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ కు సంబంధించిన రెండు డిఫరెంట్ పోస్టర్లను కూడా గతంలో రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. మరో అదిరిపోయే అప్డేట్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని దర్శకుడు ప్లాన్ వేశాడు. ఇక సోమవారం సినిమాకు సంబంధించిన మరో కీలకమైన పాత్ర పై అప్డేట్ ఇవ్వబోతున్నారు.

Massive update on pan india star prabhas salaar character,

సలార్ సినిమాలో రాజామనార్ అనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. అయితే రాజమనార్ అనే పాత్రలో ఎవరు కనిపిస్తారో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రి గానే కాకుండా కొడుకు పాత్రలో కూడా నటిస్తున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తండ్రి పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయవచ్చని ఒక టాక్ అయితే వస్తోంది.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయంతెలిసిందే. ఆమె ఒక విలేకరి పాత్రలో కనిపించబోతున్నట్లు దర్శకుడు ఇది వరకే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇండియా మొత్తంలో భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తప్పకుండా ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలడని కూడా అభిమానుల్లో ఇప్పటికే ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే మూవీలో ఒక ప్రత్యేకమైన ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ అగ్రహీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న ట్లు సమాచారం. ఈ సినిమా అనంతరం రెబల్ స్టార్ ఆది పురుష్ సినిమాతో పాటు నాగ్ అశ్విమ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలతో రాబోతున్నాడు. అలాగే మరో రెండు సినిమాలపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X