twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇంద్ర’లో దుమ్ము రేపిన ఆ బుడ్డోడు హీరోగా వస్తున్నాడు (ఫోటోస్)

    బాల నటుడు తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించబోతున్నాడు.

    By Bojja Kumar
    |

    'ఇంద్ర' సినిమా ఆరంభంలో వచ్చే ఓ సీన్ వస్తుంది గుర్తుందా? విలన్ శివారెడ్డికి భయపడి ఎవరూ ముందుకు రాక పోవడంతో నేను ఉన్నాను నాయనమ్మా అంటూ ఓ బుడ్డోడు కత్తి పట్తి తొడగొడతాడు. ఈ సీన్లో నటించిన మాస్ట్ తేజ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల రొమాలు నొక్కబొడిచాయి.

    ఆ కుర్రాడు తెలుగులో 'ఇంద్ర'తో పాటు 'చూడాలని ఉంది', 'యువరాజు' ఇలా 50కి పైగా సినిమాల్లో బాల నటుడిగా చేశాడు. కొంతకాలంగా తర్వాత తెరమరుగైన ఈ కుర్రాడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్‌కి హీరోగా పరిచయం కాబోతున్నాడు.

    మాస్టర్ తేజ

    మాస్టర్ తేజ

    మాస్ట‌ర్ తేజ ఇప్పుడు తేజ‌గా మారి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి సంస్థ‌లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు ప‌నిచేసిన హ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

    నిర్మాత గోపి

    నిర్మాత గోపి

    నిర్మాత గోపి మాట్లాడుతూ `` క‌థ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో జ‌రిగే యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. కుటుంబ‌స‌మేతంగా చూసేలా ఉంటుందని తెలిపారు.

    రెగ్యులర్ షూటింగ్

    రెగ్యులర్ షూటింగ్

    సెప్టెంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది. `ఉయ్యాల జంపాల‌`, `స్వామిరారా` చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగీత ద‌ర్శ‌కుడు స‌న్నీ ఎం.ఆర్‌. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అని అన్నారు.

    Recommended Video

    Chiranjeevi Powerful Speech @Khaidi No150 Pre Release Event | చిరంజీవి స్పీచ్- Filmibeat Telugu
    చాలా మారిపోయిన తేజ

    చాలా మారిపోయిన తేజ

    చిన్నతనంలో తేజను చూసి..... ఇపుడు అతడిని పోల్చుకోవడం కాస్త కష్టమే. అప్పటికి, ఇప్పటికీ లుక్ పరంగా చాలా మార్పు వచ్చింది.

    English summary
    Teja Sajja, who acted as a child artist in over 50 films in the past, is all set to make his debut as a lead actor in Tollywood. In the past, he has acted in films like Indra, Yuvaraju, Vasantham, Balu, Tagore, Sri Ramadasu and Gangotri. His debut film as a hero will be directed by Hari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X