అమ్మాయిల తెరచాటు యవ్వారం...‘మస్తీ’!
హైదరబాద్: సుష్మ, దీక్షాపంత్, నాజియా ఆదిల్, రేఖ, మధుబాల హీరోయిన్లుగా చాచా దర్శకత్వంలో ఫుల్ మూన్ పిక్చర్స్ పతాకంపై పి.వి.నాగేష్ కుమార్, రవి.కే.పున్నం నిర్మిస్తున్న చిత్రం 'మస్తీ'. ఐదుగురు అమ్మాయిల జీవితానికి సంబంధించి చిక్కుముడిలో భాగంగా, నలుగురమ్మాయిలు తమ జీవితంలో కొన్ని గంటలు మిస్సయితే, ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే ఈ చిత్ర కథ. అమ్మాయిల తెరచాటు వ్యవహారాలు ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.
హత్యలు, దోపిడీలు వంటి కథనాలు ఈ చిత్రంలో వుండవని, ప్రేక్షకుడికి ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుందని, దర్శకుడు చాచా తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ "ఎలాంటి సినిమాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లకు, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అనే విశ్లేషణను జర్నలిస్ట్ గా ఉంటూ చాలా కాలంగా గమనించాను.
అందుకే ఐదు మంది హీరోయిన్లతో మిస్సింగ్ అవర్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల జర్నలిస్ట్ లు నిర్మించిన 'ఈ రోజుల్లో', 'లవ్లీ', 'రొమాంటిక్ క్రైమ్ స్టోరీ', 'జర్నీ' తదితర చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. విజయ్‌కూరాకుల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని, అమ్మాయిల మనస్తత్వాలు ఎలా వుంటాయి, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు ఏమిటనే అంశంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.
సుష్మా, దీక్షాపంత్, నాజియా, ఆదిల్, రేఖ, మధుబాల, చాణక్య, ప్రదీప్, ప్రేమ్, శక్తిమాన్, కాటంరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపీనాథ్, నిర్మాతలు: పి.వి.నాగేష్‌కుమార్, రవి కె.పున్నం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చాచా.


Click it and Unblock the Notifications











