ఆకట్టుకుంటున్న మాతంగి ట్రైలర్.. మరో అమ్మోరు చిత్రంలా..
Recommended Video

Ramya Krishna Mathangi Movie Trailer మాతంగి ట్రైలర్ !
బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ తాజా చిత్రం మాతంగి. మరో అమ్మోరు లాంటి చిత్రాన్ని నిర్మాత వినయ్ కృష్ణన్ రూపొందించగా, తమ్మరక్కుళ్లం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకురాలు నందినిరెడ్డితోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నది.
ఈ సందర్బంగా మాతంగి చిత్ర హీరోయిన్ రమ్యకృష్ణ, అలా మొదలైంది, కళ్యాణ వైభోగం చిత్రాల దర్శకురాలు నందినిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రంలోని నటీనటులు: రమ్యకృష్ణ, జయరాం, సంపత్, కళాభవన్ మణి, సాంకేతిక వర్గం: నిర్మాత: వినయ్ కృష్ణన్, దర్శకత్వం: కన్నన్ తమ్మరక్కుళ్ళం, సంగీతం: రతేష్ వేగ తదితరులు.


Click it and Unblock the Notifications











