twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ సపోర్ట్ దొరికింది 'మత్తు వదలరా'.. సోషల్ మీడియాలో వైరల్ పిక్

    |

    చిన్న సినిమాలకు పెద్ద హీరోల సపోర్ట్ దొరికితే ఆ కిక్కే వేరు. టీజర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయడం లాంటివి స్టార్ హీరోలతో చేయించారంటే చాలు.. ఇక ఆ సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు లెక్క. ఈ లాజిక్ సరిగ్గా ఫాలో అవుతూ 'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది చిత్రయూనిట్.

    ఎన్టీఆర్ సపోర్ట్.. 'మత్తు వదలరా'

    ఎన్టీఆర్ సపోర్ట్.. 'మత్తు వదలరా'

    మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా 'మత్తు వదలరా'. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

    సినిమాపై హైప్.. ఎన్టీఆర్ హెల్ప్

    సినిమాపై హైప్.. ఎన్టీఆర్ హెల్ప్

    డిఫరెంట్ కాన్సెప్ట్, నేటి తరానికి కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా వదిలిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. పైగా ఈ పోస్టర్‌ని ఎన్టీఆర్ విడుదల చేయడం బాగా కలిసొచ్చే అంశంగా మారింది.

    న్యూస్ పేపర్స్‌పై నిద్ర.. దర్శకుడి ఆలోచన

    న్యూస్ పేపర్స్‌పై నిద్ర.. దర్శకుడి ఆలోచన

    ఈ పోస్టర్‌లో న్యూస్ పేపర్స్‌పై నిద్రపోతున్న హీరోను చూపించారు. అతని టీషర్ట్‌పై టెక్నీషియన్స్ పేర్లు రాసి ఉండటం దర్శకుడి లోని కొత్త థాట్ చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్' అనే కొటేషన్ కూడా ఇచ్చారు.

    మత్తు వదలరా అంటూ ఎన్టీఆర్ ట్వీట్..

    తాజాగా 'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ చేసిన ఎన్టీఆర్.. ఆ పోస్టర్‌ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని చెబుతూ.. మత్తు వదలరా చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎన్టీఆర్.

    మత్తు వదలరా మూవీ..

    మత్తు వదలరా మూవీ..

    మత్తు వదలరా సినిమాకు నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి (చెర్రీ) - సుమలత నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. కథలో కొత్తదనం, నేటితరానికి వినోదాల విందు, గ్లామర్ పార్ట్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు యూనిట్ సభ్యులు.

    English summary
    Mathu Vadalara movie First look Released by N. T. Rama Rao Jr.. He posted that poster in his twitter and thats going viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X