»   » అతని నాలుక కోయండీ కోటి ఇస్తాను.... సినిమా తీస్తే ఇంత ధారుణమా?

అతని నాలుక కోయండీ కోటి ఇస్తాను.... సినిమా తీస్తే ఇంత ధారుణమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ ప్రభావం జనాల మీద ఎంతుందో గానీ... చిత్ర రూపకర్తలు మాత్రం ఈ కాన్సెప్ట్ ను బాగా వాడుకుంటున్నారు. స్వచ్ఛ్ భారత్ ఇనిస్పిరేషన్ తో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే టైటిల్ పెట్టాడు. ఏ వెడ్నస్ డే, బేబి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కావడం... మోడీ స్వచ్ఛ భారత్ స్పూర్థితో తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో... ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ కట్టేందుకు సిద్ధపడతారు. అలాంటిది ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి కట్టించిన వ్యక్తి కథే ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అట. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అంటూ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కొందరు మతవాదులకి కోపం తెప్పించేలా ఉందట. ఈ సినిమా షూటింగ్ ని అడ్డుకుంటామంటూ ఇప్పటికే పలు సంస్థలు హెచ్చరించాయి ఇంతకీ ఈ టాయిలెట్ కథేమిటి? స్వచ్చభారత్ ప్రోగ్రాం కి అనుకూక్లంగానే ఉన్న ఈ కథ ఎవరి అసహనానికి ఎందుకు కారణమాయ్యిందీ అంటే...

 కొన్ని వందల ఏళ్ళుగా:

కొన్ని వందల ఏళ్ళుగా:


మ‌ధుర జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన‌ నంద్‌గావ్‌, బ‌ర్సానా గ్రామాల నడుమ పెళ్ళి సంబందాలు కుదరవు... ఈ రెండు గ్రామాల మధ్యా యువతీ యువకులు పెళ్ళి చేసుకోవటం నిషిద్దం కొన్ని వందల ఏళ్ళుగా ఈ సాంప్రదాయ కొనసాగుతూనే ఉంది.. చుట్టు పక్కల ఏ గ్రామం నుండైనా కోడలినీ , అళ్ళున్నీ తెచ్చుకోవచ్చు.

 ఇంతకీ ఏం జరుగుతోందంటే:

ఇంతకీ ఏం జరుగుతోందంటే:


కానీ ఏ రెండు గ్రామాల లో పుట్టిన వారు రెండో గ్రామం లో ఉన్న మనిషిని పెళ్ళి చేసుకోవటానికి వీళ్ళేదు... సరిగ్గ ఇదే పాయింట్ మీద ఇప్పుడు దుమారం చేలరేగింది... ఆ సినిమా డైరెక్టర్ని చంపేస్తాం అని ప్రత్యక్షంగానే సవాళ్ళు విసిరే స్థాయికి వెళ్ళింది... ఇంతకీ ఏం జరుగుతోందంటే... మరీ అంత కోపాలని రెచ్చగొట్టే సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందీ అనేది ఇక్కడ ఎవ్వరికీ క్లారిటీ లేని విషయం.

 డైరెక్ట‌ర్ నాలుక తెస్తే కోటి :

డైరెక్ట‌ర్ నాలుక తెస్తే కోటి :


సినిమా టైటిల్‌, రెండు గ్రామాల పెళ్లి సాంప్ర‌దాయాల‌ను ఉల్లంఘించేలా ఉన్న దాని స్టోరీలైన్‌పై తీవ్రంగా మండిప‌డుతున్న మ‌ధుర‌కు చెందిన ఓ సాధువు.. ఆ సినిమా డైరెక్ట‌ర్ నాలుక తెస్తే కోటి ఇస్తా అంటూ ప్ర‌క‌టించాడు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న ఆ సినిమా పేరు టాయిలెట్‌-ఏక్ ప్రేమ్ క‌థా.

 టైటిల్‌ను వెంట‌నే మార్చేయాల‌ని:

టైటిల్‌ను వెంట‌నే మార్చేయాల‌ని:


ఈ టైటిల్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఫూల్‌డోల్ బేహారి దాస్ మ‌హ‌రాజ్ అనే సాధువు.. ఆ టైటిల్‌ను వెంట‌నే మార్చేయాల‌ని, లేక‌పోతే బ్ర‌జ్ ప్రాంతంలో జ‌రుగుతున్న షూటింగ్‌ను అడ్డుకుంటామ‌ని ప్రొడ్యూస‌ర్‌కు హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ఈ సినిమా షూటింగ్ మ‌ధుర జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన‌ నంద్‌గావ్‌, బ‌ర్సానా గ్రామాల్లో జ‌రుగుతోంది.

టాయిలెట్ సినిమాలో:

టాయిలెట్ సినిమాలో:

ఈ నంద్‌గావ్‌, బర్సానా గ్రామాల పురుషులు, స్త్రీల మ‌ధ్య పెళ్లి సంబంధాలు లేక‌పోవ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తోంది. కృష్ణ భ‌గ‌వానుడు, రాధ‌ల మ‌ధ్య ఉన్న ప‌విత్ర ప్రేమ‌కు గుర్తుగా ఈ రెండు గ్రామాల మ‌ధ్య పెళ్లి సంబంధాలు ఉండ‌కూడ‌ద‌ని అక్క‌డివాళ్లు పెట్టుకున్న నియ‌మం. కృష్ణుడిది నంద్‌గావ్ కాగా.. రాధది బ‌ర్సానా. అయితే ఈ టాయిలెట్ సినిమాలో మాత్రం రెండు గ్రామాల మ‌ధ్య పెళ్లి సంబంధాలు ఉన్న‌ట్లుగా చూపిస్తున్నార‌న్న‌ది ఆ గ్రామ‌స్థుల ఆరోప‌ణ‌.

మ‌రో మ‌త‌పెద్ద:

మ‌రో మ‌త‌పెద్ద:


స‌మాజానికి సందేశం ఇవ్వాల‌నుకుంటే సినిమా పేరును టాయిలెట్‌-ఏ స్వ‌చ్ఛ అభియాన్‌గా పెట్టుకోవాల‌ని మ‌రో మ‌త‌పెద్ద మ‌హామండ‌లేశ్వ‌ర్ గిరి మ‌హ‌రాజ్ అన్నారు. రాధాకృష్ణులు న‌డ‌యాడిన ఇలాంటి ప‌విత్ర స్థ‌లంలో అలాంటి టైటిల్‌తో ఉన్న సినిమా షూటింగ్‌ను అంగీక‌రించ‌బోమ‌ని మ‌హంత్ హ‌రిబోల్ మ‌హ‌రాజ్ అనే మ‌రో సాధువు స్ప‌ష్టంచేశాడు.

 డైరెక్ట‌ర్ న‌రైన్ సింగ్ :

డైరెక్ట‌ర్ న‌రైన్ సింగ్ :


ఈ సాంప్ర‌దాయాన్ని ఉల్లంఘించ‌డాన్ని ఇక్క‌డి ముస్లిం స‌మాజిక వ‌ర్గం కూడా అంగీక‌రించ‌బోద‌ని ఆదిత్య‌నాథ్ మ‌హ‌రాజ్ అన్నాడు. మ‌రోవైపు ఈ సినిమా డైరెక్ట‌ర్ న‌రైన్ సింగ్ మాట్లాడుతూ.. మ‌త విశ్వాసాల‌ను త‌న సినిమా దెబ్బ‌తీస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. సినిమా విడుద‌లైన త‌ర్వాత అంద‌రి అనుమానాల ప‌టాపంచ‌ల‌వుతాయి.

 సాంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా:

సాంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా:


ఈ సినిమా మ‌హిళా సాధికార‌త‌, స్వ‌చ్ఛ‌త అంశాల‌పై రూపొందించాం. మొఘ‌ల్ సామ్రాజ్య కాలం నుంచి హోలీకి వేదికైన బ‌ర్సానా వేదిక‌గా ఈ సందేశాన్ని ఇవ్వ‌డానికే ఆ గ్రామంలో షూటింగ్ చేస్తున్నామ‌ని న‌రైన్ తెలిపారు. బ్ర‌జ్ ప్రాంత సాంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా సినిమా స్టోరీ ఉంటే న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు త‌ప్ప‌వ‌ని గ‌త వారం గోకులేష్ క‌టారా అనే ఓ న్యాయ‌వాది సినిమా డైరెక్ట‌ర్‌ను హెచ్చ‌రించారు.

 'స్వచ్ఛభారత్ అభియాన్:

'స్వచ్ఛభారత్ అభియాన్:


టాయిలెట్ సినిమాలో భూమి పెడ్నేకర్ అక్కీ సరసన నటించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన 'స్వచ్ఛభారత్ అభియాన్' ఆధారంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ నెలలో షూటింగ్ మొదలవుతుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.

English summary
A Mathura sadhu has declared a reward of Rs one crore to anybody who brings the tongue of the director of the film Akshay Kumar starrer ‘Toilet – Ek Prem Katha"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu