ఆ రూమర్లపై ఫైర్.. ‘ఆచార్య’లో ఇద్దరి భాగస్వామ్యం.. రామ్ చరణ్‌కు మద్దతుగా నిర్మాణ సంస్థ

వచ్చిన ప్రతీ గాలి వార్తపై స్పందించాల్సిన పని లేదు. అయితే కొన్నిస్లారు మాత్రం వెంటనే ఖండించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సదరు వ్యక్తి, నిర్మాణ సంస్థ, సినిమాకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తే వెంటనే స్పందించడం మంచిది. ఈ క్రమంలో కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతోన్న ఆచార్య సినిమాపై రోజుకో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మీదనే ఓ రూమర్ క్రియేట్ అయింది. వెంటనే తేరుకున్న నిర్మాణ సంస్థ రామ్ చరణ్‌కు మద్దతుగా నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

రెండు నిర్మాణ సంస్థలపై ఆచార్య

రెండు నిర్మాణ సంస్థలపై ఆచార్య

ఆచార్య సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోంది. మొదటగా ఈ సినిమాను రామ్ చరణ్ తన బ్యానర్‌పై నిర్మించాలని ఫిక్స్ కాగా.. కొరటాల ప్రోద్భలంతో మ్యాట్నీ రంగంలోకి వచ్చింది.

నిర్మాణంలో పైసా కూడా..

నిర్మాణంలో పైసా కూడా..

అయితే ఆచార్య నిర్మాణంలో రామ్ చరణ్ పైసా కూడా పెట్టడం లేదనే రూమర్స్ బయటకు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు ఈమేరకు వార్తలు హల్చల్ చేశాయి. మొత్తం మ్యాట్నీ సంస్థే డబ్బులు పెడుతోందని, రామ్ చరణ్ కేవలం లాభాల్లో షేర్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.

స్పందించిన సంస్థ..

ఆచార్య సినిమాపై వచ్చిన రూమార్స్‌ను ఖండిస్తూ.. మ్యాట్నీ సంస్థ స్పందించింది. నిర్మాణ భాగస్వామ్యంలో రెండు నిర్మాణ సంస్థలు సమానమైన పాత్రను పోషిస్తున్నాయని, ఏదైనా రెండింటి బాధ్యత ఉంటుందని తెలిపింది.

Recommended Video

Trisha Walks Out Of Chiranjeevi’s ‘Acharya’ Movie
రామ్ చరణ్‌కు మద్దతు..

రామ్ చరణ్‌కు మద్దతు..


రామ్ చరణ్ నయా పైసా పెట్టడం లేదని వచ్చిన వార్తలను ఖండించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో ఆ వార్తలన్నీ రూమర్లేనని సదరు వెబ్‌సైట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X