»   » "బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో ఈరోజు" : మాభూమి దర్శకుడి "మట్టిమనుషులు" ప్రదర్శన

"బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో ఈరోజు" : మాభూమి దర్శకుడి "మట్టిమనుషులు" ప్రదర్శన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగం లో తెలంగాణా ప్రాంత ఔత్సాహిక కళాకారులనూ, దర్షకత్వం లో ప్రతిభ ఉన్న యువకులనూ ప్రోత్సహించటానికి తెలంగాణా ప్రభుత్వం ఆద్వర్యం లో బతుకమ్మ పండుగ సందర్భంగా "ఫిల్మోత్సవం" నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అంతరించి పోతున్న కొన్ని కళలా రూపాలను దృశ్య రూపం లో భద్ర పరిచే ప్రయత్నంలో భాగంగా. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఉన్న ఔత్సాహిక యువకులతో కలిసి కొన్ని డాక్యుమెంటరీలను నిర్మించిన భాషా సంస్కృతిక శాఖ. బతుకమ్మ ఫిల్మోత్సవ్ సంధర్భంగా వాతిని ప్రదర్శించనుంది.

ఈరోజు సాయంత్రం నుంచీ 7 వతేదీ వరకూ జరుగనున్న బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో ఈ డాక్యుమెంటరీలూ, వివిద సామాజికాంశాలపై నిర్మించిన షార్ట్ ఫిలింల ప్రదర్శన కూడా జరుగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు బీ నర్సింగ రావు "మట్టి మనుషులు" సినిమా ప్రదర్శన రవీంద్ర భారతి మొదటి అంతస్తు "పైడి జయరాజు మినీ హాల్' లో జరగనుంది. పాలమూరు జిల్లా వలస బతుకుల పై ఆయన తీసిన ఈ సినిమా 1991లో మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా గెలిచింది.

Matti manushulu

ఈ రోజు సాయంత్రం జరగబోయే ఈ స్క్రీనింగ్ అనంతరం. ఈ చిత్ర దర్శకులు బీ. నర్సింగ రావు గారు "మీట్ ద మేకర్" కార్యక్రమం లో పాల్గొంటారు. చివరి రోజు వివిధ టి‌వి మరియు వెబ్ చానల్స్ తీసిన బతుకమ్మ వీడియో పాటలను ప్రదర్శించటం జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా రోజూ మిగతా సినిమాల ప్రదర్శన, మిగిలిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి నర్సింగ రావు గారితో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

Matti manushulu

అక్టోబర్ 3- మట్టిమనుషులు - దర్శకులు బీ. నర్సింగ రావు గారి ముఖాముఖీ అక్టోబర్ 4 - కాకి పడగల కథ డాక్యుమెంటరీ - అక్షర కుమార్, సాధనా శూరులు డాక్యుమెంటరీ - ఐ. శివ అక్టోబర్ 5 - బొమ్మలొల్లు - అజిత్ నాగ్ , ఒగ్గు చుక్క - ఖ్వృ మహేంద్ర అక్టోబర్ 6 - కోలాటం బై హుమాయూన్ సంఘీర్ , పేరిణి వీడియో - యెన్నెన్జీ (ణ్ణ్ఘ్-నరేందర్ గౌడ్ నగులూరి) అక్టోబర్ 7 - వివిధ చానల్స్ నిర్మించిన బతుకమ్మ పాటల ప్రదర్శన లు జరుగనున్నాయి. ప్రవేశ రుసుము లేకుండానే ఈ ప్రదర్శనలన్నీ చూసే అవకాశం కల్పిస్తున్నట్టు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

English summary
"Batukamma filmotsav" first Day "Matti manushulu" Movie screaning Directed by Maa Bhoomi narsinga Rao in Ravindra bharati
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu