ఆల్ టైం గ్రేట్ ఫిలిం గా తెలుగు ఓల్డ్ క్లాసిక్
హైదరాబాద్ : సిఎన్ ఎన్-ఐబిఎన్ నిర్వహించిన ఓటింగ్ లో ఆల్ టైం గ్రేట్ ఫిల్మ్ గా తెలుగు ఓల్డ్ క్లాసిక్ మాయాబజార్ ఎంపికైంది. ఇండియన్ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈపోల్ లో పలు ఇండస్ట్రీల నుంచి సినిమాలను ఎంపికకు పెట్టారు. అందులో మాయాబజార్ నిలవటం తెలుగువారికి గర్వకారణమైంది.
పోల్ పూర్తయ్యే సమయానికి 16,960 ఓట్లు సంపాదించింది. మొత్తం వచ్చిన ఓటింగ్ లో 23.91% మాయాబజార్ కే దక్కింది. షోలే, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి చిత్రాలను దాటుకుని మాయాబజార్ ముందుకు వచ్చింది.
తెలుగు నుంచి ఎంపికైన చిత్రాలు వరసగా....

1) మాయాబజార్
7) శివ
11) మా భూమి
12) సాగరసంగమం
13) పాతాళభైరవి
14) శంకరాభరణం
15) నర్తనశాల


Click it and Unblock the Notifications











