For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 వ తరగతి పాఠంగా 'మాయా బజార్'(ఫోటో ఫీచర్)

By Srikanya
|

హైదరాబాద్ : ప్రేక్షకులు 1957లో తొలిసారి ఈ సినిమాని చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు. మునుముందూ చూస్తారు. తెలుగు సినిమా ఉన్నంతవరకూ మాయాబజార్ చిత్రం గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం...వింటాం...తెలుసుకుంటూనే ఉంటాం. అందుకేనేమో ఈ కళాఖండం గొప్పతనాన్ని తర్వాత తరాల వారికి తెలియజేయటం కోసం ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో పాఠంగా మార్చి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంగ్ల పుస్తకంలో యూనిట్‌-4 కింద ఫిల్మ్స్‌ అండ్‌ థియేటర్స్‌ పేరుతో కొత్త పాఠాన్ని పొందుపరిచారు. ఇందులో అలనాటి నటిమణి సావిత్రి గురించి, ఆనాటి సినిమాలు మాయాబజారు, శ్రీ420, వందేళ్ల సినీచరిత్ర గురించి క్లుప్తంగా వివరించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్లంలో తప్పుతున్నారనే ఉద్దేశంతో తాజాగా ఆంగ్ల, తెలుగు మాధ్యమాలకు కలిపి ఒకే పాఠ్య పుస్తకాన్ని కేటాయించారు. ఈ పేజీలో మాయా బజార్ లో ఫోటోలు వేసి,సినిమా గురించి వివరించటం జరిగింది.

ఇక గతంలో రజనీకాంత్ చిత్రం "రోబో" భారత దేశంలో ఉత్తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ గా పేరు పొందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ లో పాఠంగా పెట్టారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తమిళ వెర్షన్ ని కాంటింపరరీ ఫిల్మ్ ఇండస్ట్రీ విభాగంలో చేర్చారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయానికి కారణం వారు అవలించిన మార్కెటింగ్ విధానాలు అనే యాంగిల్ లో ఈ సినిమాను పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓ కేస్ స్టడీగా చూపుతూ సినిమా వ్యాపారం విశ్లేషణగా వివరిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా రజనీ ముత్తు చిత్రం కూడా సిలబస్ లో చేర్చారు.

మాయాబజార్ చిత్రం విశేషాలు మరెన్ని స్లైడ్ షో లో...

అలనాటి అద్బుతం

అలనాటి అద్బుతం

మాయాబజార్‌ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్‌ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని అందరూ అంటారు. ఇది అక్షరాలా నిజం.

స్క్రీన్ ప్లే టెక్నిక్...

స్క్రీన్ ప్లే టెక్నిక్...

నిజానికి మాయబజార్‌ పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా ఎవరికీ తట్టదేమో. పాండవుల ప్రస్తావన లేకుండా జరిగే కథ అది.

మొదటగా..

మొదటగా..

ఈ కథని పూర్వం శశిరేఖా పరిణయం అనే పేరుతో కర్నాటక రాష్ట్రంలో వీధి నాటకాలుగా ఆడేవారు. దానికి ఒక మహోన్నత్తమైన స్థానాన్ని కలిపించింది మాత్రం కె.వి.రెడ్డి-పింగళి ద్వయమనే చెప్పుకోవాలి.

సాహిత్యంగానూ..

సాహిత్యంగానూ..

ఈ సినిమాకి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే ఆయువుపట్టులయితే, పింగళి నాగేంద్ర గారి సాహిత్య చమత్కారాలు ప్రాణం పోశాయి. లాహిరి లాహిరి లాహిరిలో పాట నోట నానని తెలుగు ప్రేక్షకులుండరు. లాహిరి అంటే మాయ అని అర్థం. ఈ ఒక్క పాట ఆధారంగా చేసుకుని కథంతా రూపకల్పన చేస్తారు.

కథ మొత్తం

కథ మొత్తం

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, సాగెనుగా అని మొదలెట్టి రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో అని ముగించడం పింగళివారికే చెల్లింది. ప్రేమ మాయలో జగమంతా ఓలలాడుతోంది అని ఆరంభించి, ఆ మాయకి కారకుడు శ్రీకృష్ణుడే అని ముగింపు పలకడం ఓ అద్భుతమైన ఆలోచన.

ఆ పాట టైమ్ లో...

ఆ పాట టైమ్ లో...

సినిమాలో శశిరేఖ పాత్రధారి సావిత్రిపై ‘నీవేనా నను తలచినది...' పాటను చిత్రీకరిస్తున్నప్పటి స్టిల్ ఇది (కుడి). సావిత్రి అభినయిస్తుండగా దర్శకుడు కె.వి.రెడ్డి (కుర్చీలో), ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే తదితరులు పరిశీలిస్తున్న అపురూపమైన స్టిల్ ఇది!

సామాజిక స్పృహ

సామాజిక స్పృహ

చినచేపను, పెదచేప, చినమాయను పెనుమాయ అది స్వాహా, ఇది స్వాహా అన్నదాన్లోనే బలహీనవర్గాల బాధలను నర్మగర్భంగా చర్చించారు. పాండవుల ప్రతాపాల కన్నా, కౌరవుల ఐశ్వర్యాలు గొప్పవి కావు సామర్థ్యాలకు, ఆస్తి- అంతస్థులకు సాధారణ సమాజంలో పొంతన లేదన్న విషయాన్ని ఉటంకించారు. ఈ పదాలన్నింటిలోనూ బ్రహ్మాండమైన సాహిత్య స్ఫురణ, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

అద్బుతమైన మాటలు..

అద్బుతమైన మాటలు..

ప్రతీ పదంలోను సాహిత్య సంపద, భావ చాతుర్యం గుబాళించి ఉంటుంది. పదాలు వాడడంలో ఆయన బ్రహ్మాండనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఇంకా అగ్గిబుగ్గీకాకయ్యా, వీరతాడు వంటి పడికట్టు పదాలను తెలుగు ప్రజలనోళ్లలో నానేటట్టుగా చెక్కారు. సభాపిరికి, అలమలం లాంటి కొత్తపదాలు చక్కిలిగింతలు పెడతాయి.

రంగులద్ది మరీ...

రంగులద్ది మరీ...

'మాయాబజార్" చిత్రానికి రంగులు హంగులు దిద్ది గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేయడం, ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం తెలిసిందే.

అక్కినేని నాగేశ్వరరావు మాట్టాడుతూ....

అక్కినేని నాగేశ్వరరావు మాట్టాడుతూ....

మాయాబజార్ చిత్రాన్ని ప్రత్యేకించి ఇప్పుడు రంగులు చేయండం కాదు. ఈ చిత్రం ఎప్పుడూ కలర్ ఫుల్ చిత్రమే. ఈ చిత్రాన్ని రంగుల్లో చూసి నేను ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని ఒరిజినల్ కలర్స్ ని నేను సెట్ లోనే చూశాను అని అన్నారు.

English summary
The Education Department of Andhra Pradesh government has revised the syllabus of class 10 for the academic year, 2014-2015. One of the all time great classics of tollywood, 'mayabazar' found its place in the new text book of English.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more